Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
- కాశీ హల్వా పేరుకు కారణమైన ఆసక్తికరమైన కథ
- బూడిద గుమ్మడికాయతో చేసే ఉడిపి స్పెషల్ స్వీట్
- కుంకుమపువ్వు, నెయ్యితో నోరూరించే రుచి
- ఇంట్లోనే సులభంగా కాశీ హల్వా తయారీ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traditional Desserts : భారతీయ వంటకాలలో హల్వాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రకాల హల్వాలు ఉన్నప్పటికీ, ఉడిపి సాంప్రదాయ వంటకాల నుండి వచ్చిన ‘కాశీ హల్వా’ (Kashi Halwa) రుచి మాత్రం చాలా ప్రత్యేకం. బూడిద గుమ్మడికాయ, చక్కెర , నెయ్యితో తయారుచేసే ఈ క్లాసిక్ స్వీట్‌ను సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లలో ప్రత్యేకంగా వడ్డిస్తారు.
ప్రారంభంలో కేవలం కర్ణాటకలోని ఉడిపి పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఈ స్వీట్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ రుచికరమైన హల్వాకు ఆ పేరు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథతో పాటు, దీనిని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
‘కాశీ హల్వా’ అని ఎందుకు పిలుస్తారంటే?
సీతాఫలం, రామఫలం లాగే ‘కాశీఫలం’ కూడా ఒకటి ఉంది. సంస్కృతంలో కాశీఫలం అంటే ‘బూడిద గుమ్మడికాయ’ (Ash Gourd) అని అర్థం. కాశీఫలంతో తయారుచేసే హల్వా కాబట్టే దీనికి కాలక్రమేణా ‘కాశీ హల్వా’ అనే పేరు వచ్చింది. ఈ స్వీట్ మంచి రుచిని ఇవ్వాలంటే నాణ్యమైన, బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
కావలసిన పదార్థాలు (ఇద్దరికి సరిపోయేలా)
- బూడిద గుమ్మడికాయ – అర కిలో
- నెయ్యి – పావు కప్పు
- చక్కెర – ఒక కప్పు
- జీడిపప్పు – గుప్పెడు
- కిస్మిస్ – తగినన్ని
- యాలకుల ఎసెన్స్ లేదా పొడి – తగినంత
- పాలు – 3 టీస్పూన్లు
- కుంకుమపువ్వు – ఒక చిటికెడు
తయారీ విధానం: ఆహా అనిపించేలా ఇలా చేయండి
స్టెప్ 1: కుంకుమపువ్వు పాలు సిద్ధం చేయడం
ముందుగా తీసుకున్న మూడు చెంచాల పాలలో చిటికెడు కుంకుమపువ్వు రేకులను వేసి కాసేపు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల హల్వాకు మంచి సువాసన, అద్భుతమైన రుచితో పాటు ఎటువంటి కృత్రిమ రంగులు వాడకుండానే సహజసిద్ధమైన పసుపు, కాషాయ రంగు వస్తుంది.
స్టెప్ 2: గుమ్మడికాయను తురమడం
బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల ఉండే గింజల భాగాన్ని, పైన ఉండే గట్టి సిప్పెను (తొక్కను) పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలను క్యారెట్ తురిమినట్లుగా సన్నగా తురుముకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: నీరు పోయేలా ఉడికించడం
స్టవ్ వెలిగించి ఒక బాణలి (పాన్) పెట్టుకుని అందులో తురిమిన బూడిద గుమ్మడికాయను వేయాలి. బూడిద గుమ్మడికాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి నీరు, నెయ్యి కలపకుండా, ఆ కాయలో ఉన్న నీరంతా ఇoptionsపోయి పొడిగా అయ్యేంత వరకు 4 నుండి 5 నిమిషాల పాటు చిన్న మంటపై బాగా వేయించాలి. నీరంతా పోయాక అందులో ఒక కప్పు చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక మిశ్రమం కాస్త లూజ్‌గా మారుతుంది.
స్టెప్ 4: కుంకుమపువ్వు పాలు కలపడం
చక్కెర పాకంలో గుమ్మడికాయ ఉడుకుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కుంకుమపువ్వు పాలను అందులో పోసి బాగా మిక్స్ చేయాలి. హల్వా దగ్గరపడి, గట్టిపడేంత వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి.
స్టెప్ 5: డ్రై ఫ్రూట్స్ తాలింపు , ముగింపు
మిశ్రమం చక్కటి హల్వా రూపంలోకి వస్తున్నప్పుడు, వేరే చిన్న పాన్‌లో 4 నుండి 5 చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఈ వేడి వేడి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని నేరుగా ఉడుకుతున్న హల్వాలో పోసి కలపాలి. చివరగా మరికొద్దిగా నెయ్యి, యాలకుల పొడి లేదా ఎసెన్స్ వేసి అన్ని పదార్థాలు కలిసేలా తిప్పాలి. హల్వా బాణలికి అంటుకోకుండా నెయ్యి పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచికరమైన, నోట్లో వేస్తే కరిగిపోయే వేడి వేడి ‘ఉడిపి కాశీ హల్వా’ సిద్ధం! దీనిని వేడిగా వడ్డించినా, చల్లారిన తర్వాత తిన్నా అద్భుతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!