NTV Telugu Site icon

Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..

Biryani

Biryani

Biryani: బిర్యానీ ఈ పేరు వింటే చాలు నోట్లో లాలాజలం లీకవుతుంది. అంతగా ఈ బిర్యానీకి మన ప్రజలు అలవాటయ్యారు. ఇప్పటికీ మనం రెస్టారెంట్లకు వెళ్తే ముందుగా గుర్తొచ్చే పదం బిర్యానీనే. ఇది లేకుండా ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఫినిష్ కావడం లేదు. జూన్ 2 ‘ఇంటర్నేషనల్ బిర్యానీ డే’ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 7.6 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది.

జనవరి 2023 నుండి జూన్ 15, 2023 వరకు చేసిన స్విగ్గీ ఆర్డర్లను పరిశీలిస్తే ఏకంగా 8.26 శాతం బిర్యానీ ఆర్డర్లు పెరిగాయి. 2022 ఇదే కాలంతో పోలిస్తే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్‌లలో ఈ వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ప్లాట్‌ఫారమ్ ద్వారా బిర్యానీని అందించే 2.6 లక్షల రెస్టారెంట్లు ఉంటే 28 వేలకు పైగా రెస్టారెంట్లు ఈ బిర్యానీల్లో ప్రఖ్యాతిని కలిగి ఉన్నాయి. లక్నో బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ ఇలా దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషానికి 216 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: Maharashtra Bus Fire: మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..

బెంగళూర్ నగరంలో అత్యధికంగా 24,000 రెస్టారెంట్లు బిర్యానీ అందిస్తున్నాయి. బెంగళూర్ తర్వాత 22,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో ముంబై రెండోస్థానంలో.. 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో ఢిల్లీ మూడోస్థానంలో ఉన్నాయి. బిర్యానీ ప్రియుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూన్ వరకు 72 లక్షల ఆర్డర్లలో హైదరాబాదీలు బిర్యానీ లవర్స్ అనిపించుకున్నారు. ఆ తరువాతి స్థానంలో 50 లక్షల ఆర్డర్లతో బెంగళూర్ రెండోస్థానంలో, 30 మిలియన్ల ఆర్డర్లలో మూడోస్థానంలో ఉంది.

62 లక్షల ఆర్డర్లు.. 85 వేరియంట్లలో దమ్ బిర్యానీ అత్యంత ప్రజాధరణ పొందినట్లుగా స్వీగ్గీ డేటా వెల్లడిస్తోంది. హైదరాబాద్ బిర్యానీకి 28 లక్షల ఆర్డర్లు వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ బిర్యానీ లవర్ ఏకంగా రూ.31,532 బిర్యానీ ఆర్డర్లకు వెచ్చించాడు.