Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabudana Soup Recipe: వాతావరణం వేగంగా మారుతోంది. కొద్ది రోజుల్లోనే వాతావరణం చల్లగా మారిపోనుంది. ఇలా కాలం మారే సమయంలో చాలామందిని తీవ్రమైన నీరసం, అలసట, నీరసంతో పాటు సీజనల్ వ్యాధులు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాలతో నిండిన ఆహారం చాలా అవసరం. ఇలాంటి టైమ్‌లో మ్యార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అవి ఎంత వరకు సేఫ్ అని అందరూ ఆలోచిస్తుంటారు. అందుకే ఈ సీజన్లో మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచేలా ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన ‘సబుదానా (సగ్గుబియ్యం) సూప్’ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.
సబుదానా సూప్‌తో లభించే అద్భుత ప్రయోజనాలు
సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి క్షణాల్లో శక్తిని అందిస్తాయి. ఇక ఇందులో వాడే అల్లం, మిరియాలు, జీలకర్ర, కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ సూప్ జీర్ణం కావడం చాలా తేలిక, అంతేకాక కడుపులో మంట, ఎసిడిటీని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. మారుతున్న ఈ వాతావరణంలో రోజూ ఒక కప్పు ఈ వేడివేడి సూప్ తాగా లంటే, రోజంతా చురుగ్గా ఉంటారు, అలసట అనేదే దరిచేరదు.
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం: 1/2 కప్పు
నేతిలో వేయించిన వేరుశెనగపప్పు: 4 పెద్ద స్పూన్లు
మఖానా (తామర గింజలు): 1 కప్పు
జీడిపప్పు: 10
బాదం: 10
బంగాళాదుంపలు: 2 (మీడియం సైజు)
టమాటో: 1
దేసీ నెయ్యి: 5 పెద్ద స్పూన్లు
జీలకర్ర: 1/2 చిన్న స్పూన్ (తిరగమాతకు మరో 1 స్పూన్)
మిరియాలు: 1/2 చిన్న స్పూన్
సైంధవ లవణం (తగినంత)
కరివేపాకు, అల్లం తురుము, పచ్చిమిర్చి
నిమ్మరసం: 1 స్పూన్
కొత్తిమీర తురుము
తయారీ విధానం:
ముందుగా 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని నీటిలో శుభ్రంగా కడిగి, అర్ధగంట (30 నిమిషాలు) పాటు నానబెట్టుకోవాలి. ఒక పాత్రలో 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, మఖానా, పల్లీలు) వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో మరికొద్దిగా నెయ్యి వేసి, సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలను 80 శాతం ఉడికే వరకు వేయించి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 30 సెకన్ల పాటు వేగనివ్వాలి. అందులో సన్నగా తరిగిన టమాటో, కూరగాయలు వేసి ఒక నిమిషం పాటు కలపాలి. ఆపై 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి నీటిని మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేయాలి. వెంటనే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేసి, మంటను మీడియంలో ఉంచి 5 నుండి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం పారదర్శకంగా (ముత్యాల్లా) మారే వరకు ఉంచాలి. సూప్ కాస్త చిక్కబడిన తర్వాత మిరియాల పొడి, నిమ్మరసం కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి, పౌష్టికాహార సబుదానా సూప్ సిద్ధం.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?