Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
- రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు
- బెల్లం , రాగితో ఈజీ ఈవెనింగ్ స్నాక్
- పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ రెసిపీ
- సాఫ్ట్‌గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Bondalu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా టేస్టీ స్నాక్ తినాలని అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఒక మంచి ఆప్షన్ ‘రాగి స్వీట్ బోండాలు’. రాగుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో మంచివి. ముఖ్యంగా స్వీట్ ఇష్టపడే పిల్లలకు ఈ బోండాలు ఒక బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకునే ఈ రాగి స్వీట్ బోండాల తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- రాగి పిండి – 1 కప్పు
- గోధుమ పిండి – ½ కప్పు
- బెల్లం తురుము – ¾ కప్పు
- నీళ్లు – ¾ కప్పు
- యాలకుల పొడి – ½ టీస్పూన్
- వంట సోడా – చిటికెడు
- కొబ్బరి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
- నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు వేసి స్టవ్ మీద వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, గోధుమ పిండి, యాలకుల పొడి, కొబ్బరి ముక్కలు, వంట సోడా వేసి బాగా కలపాలి. తర్వాత బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా కాకుండా, బోండాలు వేసేందుకు సరిపోయేలా ఉండాలి.
ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు మూతపెట్టి నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల బోండాలు చాలా మెత్తగా వస్తాయి.
తర్వాత కడాయిలో నూనె వేడి చేసి, మీడియం మంటపై పిండిని చిన్న చిన్న బోండాలుగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.
ముఖ్యమైన చిట్కాలు:
పిండిని కొద్దిసేపు నానబెట్టడం వల్ల బోండాలు సాఫ్ట్‌గా వస్తాయి.
పిండి పల్చగా ఉంటే బోండాలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి.
కొబ్బరి ముక్కల బదులు జీడిపప్పు వేసినా మంచి రుచి వస్తుంది.
బెల్లం ఎక్కువైతే బోండాలు త్వరగా మాడిపోతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
రాగుల్లో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా ఉంటాయి. బెల్లం వల్ల శరీరానికి ఐరన్, మినరల్స్ అందుతాయి. మైదా లేకుండా తయారయ్యే ఈ స్నాక్ ఆరోగ్యకరమైనది కావడంతో పిల్లలకు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఇవ్వొచ్చు.
ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ రాగి స్వీట్ బోండాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి!
తాజావార్తలు
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!