Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Milk Recipe: వేసవిలో త్వరగా డీ హైడ్రేట్ అవుతుంటాం. శక్తి కోసం రోడ్ల పక్కన దొరికే అనేక రకాల జూస్‌లు తాగుతుంటాం. బయట దొరికే జూస్‌లలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతుంటారు. అవి తాగితే మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే ఎంతో టేస్టీ, హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ, శక్తిని పెంచే సహజ పానీయాల్లో రాగి పాలు (Ragi Milk) ఒకటి. రాగి (Finger Millet)లో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పానీయం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రాగి జ్యూస్‌ను తయారు చేయడానికి సుభమైన పద్దతి ఏంటో చూద్దాం..
READ MORE: Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
కావలసిన పదార్థాలు:
రాగి గింజలు – 1 కప్పు
బాదం – 10 (నానబెట్టినవి)
తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు
బెల్లం – 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్లు
నీరు – అవసరమైనంత
READ MORE: UN warning: ఆగని యుద్ధం.. ఇంధన, గ్యాస్, నిత్యావసరాల ధరలపై ఐక్యరాజ్యసమితి సీరియస్ వార్నింగ్..
తయారీ విధానం:
ముందుగా రాగి గింజలను ఒక బౌల్‌లో తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. నీరు పూర్తిగా తొలగించి, గింజలను ఒక బట్టపై పరచి ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత పాన్‌లో వేసి తక్కువ మంటపై వేపాలి. రాగి గింజలు మంచి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్ జార్‌లో రాగి గింజలు, బాదం, కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ముస్లిన్ క్లాత్ లేదా సన్నని గుడ్డతో ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. అవసరమైతే మరలా నీరు వేసి మళ్లీ గ్రైండ్ చేసి పాలు తీసుకోవచ్చు. చివరగా సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!