Site icon NTV Telugu

Mohabbat Ka Sharbat: వేసవిలో అదిరిపోయే హెల్దీ డ్రింక్! తక్కువ టైంలో.. సింపుల్‌గా పుచ్చకాయతో ఇలా చేయండి..

Mohabbat Ka Sharbat

Mohabbat Ka Sharbat

Mohabbat Ka Sharbat: ఎండలు మండుతున్న వేళ శరీరాన్ని చల్లబరిచే పానీయాల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం పుచ్చకాయతో కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే ‘మొహబ్బత్ కా షర్బత్’ రెసిపీ సూపర్ ఛాయిస్ అని చెబుతున్నారు. వేసవి కాలంలో ఈ డ్రింక్ ఎంతో ఎనర్జిటిక్‌గా, టేస్టీగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gary Kirsten: భారతదేశం T20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత గ్యారీ కిర్‌స్టన్‌కు కొత్త బాధ్యతలు..

కావలసిన పదార్థాలు:
కాచి చల్లార్చిన పాలు – అర లీటరు

పంచదార – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

రోజ్ సిరప్ – 3 టేబుల్ స్పూన్లు

పుచ్చకాయ ముక్కలు – ఒకటిన్నర కప్పు

నానబెట్టిన సబ్జా గింజలు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

ఐస్ క్యూబ్స్ – తగినన్ని

తయారీ విధానం..
ముందుగా అర లీటరు పాలలో పంచదార వేసి కరిగే వరకు కలపాలి. ఈ పాలను అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబరచాలి. పుచ్చకాయ నుంచి గింజలను సులభంగా వేరు చేసేందుకు, దానిని మూన్ షేప్‌లో కట్ చేసి, గింజలు ఉన్న లైన్ వద్ద బ్రేక్ చేయాలి. దీనివల్ల గింజలు త్వరగా బయటకు వస్తాయి. ఆ తర్వాత పల్ప్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఫ్రిజ్ లో నుంచి పాలను తీసి అందులో రోజ్ సిరప్, నానబెట్టిన సబ్జా గింజలు, పుచ్చకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. చివరగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. మరింత రుచి, ఆరోగ్యం కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన బాదం గమ్ కూడా జోడించవచ్చు. తక్కువ టైంలో.. సింపుల్‌గా తయారయ్యే ఈ హెల్దీ డ్రింక్ వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పంచదారకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడితే ఈ షర్బత్ మరింత రిచ్ టేస్ట్‌ను ఇస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే ట్రై చేసి చల్లగా ఎంజాయ్ చేయండి.

READ ALSO: Domestic Flour Mill: తక్కువ టైంలో హెల్దీ చపాతీలు.. గోధుమలు రుబ్బే హోమ్ మిషన్స్ ధర ఎంతంటే!

Exit mobile version