Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ
Quick Sooji Chilla Recipe: ఉదయం వేళ ఓవైపు ఆఫీసులు.. మరోవైపు స్కూళ్లు.. ఇతర పనులు మీద వెళ్లే వాళ్లు.. ఇలా ఇంట్లో ఒక్కటే హడావిడి ఉంటుంది.. ఈ సమయంలో అందరి పనులు చూసుకోవడంలో మహిళలు విసిగిపోతుంటారు.. అయితే, ఉదయం పూట హడావిడిలో ఉన్నప్పుడు, తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలనుకుంటే ‘సూజీ చిల్లా’ (Sooji Chilla) బెస్ట్ ఆప్షన్. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలతో కలిపి చేయడం వల్ల ఇది పిల్లలకి, పెద్దలకి ఎంతో మేలు చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
– రవ్వ (సెమోలినా): 1 కప్పు
– పెరుగు: 1/2 కప్పు
– కూరగాయలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, తురిమిన క్యారెట్
– మసాలాలు: పచ్చిమిర్చి, ఎర్ర కారం (1 స్పూన్), పసుపు (1/4 స్పూన్), అల్లం-వెల్లుల్లి పేస్ట్
– ఇతరాలు: కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, నూనె, తగినంత నీరు.
Also Read
- Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
- Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
- Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్‌లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Soya Chunks: హై ప్రోటీన్.. అదిరిపోయే టేస్ట్! 10 నిమిషాల్లో సింపుల్‌గా కర్రీని ఇలా వండేయండి..
తయారీ విధానం:
– మిశ్రమం తయారీ: ఒక గిన్నెలో రవ్వ, పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలను వేయాలి.
– మసాలాలు కలపడం: ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు మరియు కొత్తిమీర వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి దోస పిండిలా తయారు చేయాలి.
– నానబెట్టడం: ఈ మిశ్రమాన్ని 15-20 నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ బాగా నానుతుంది (తొందరగా కావాలనుకుంటే 5 నిమిషాలైనా నానబెట్టాలి).
– కాల్చడం: స్టవ్ మీద నాన్-స్టిక్ పాన్ పెట్టి, కొద్దిగా నూనె రాయాలి. సిద్ధం చేసుకున్న పిండిని పాన్ మీద దోసలా (చిన్న వృత్తాకారంలో) వేయాలి.
– సర్వింగ్: మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు కాల్చాలి. వేడి వేడి సూజీ చిల్లాను అల్లం చట్నీ, గ్రీన్ చట్నీ లేదా పెరుగుతో తింటే అద్భుతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!