Site icon NTV Telugu

PM Modi Health Secret: ప్రధాని హెల్త్‌ సీక్రెట్.. మోడీ ఎంతో ఇష్టంగా తినే పరాటాలు తయారు చేయడం చాలా ఈజీ..

Modi

Modi

PM Modi Health Secret: ప్రధాని మోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. తాను రోజు తప్పకుండా మునగకాయలతో తయారు చేసిన పరాటాలను తింటానని వెల్లడించారు. మునగలో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు ఉంటాయి. ఇవే ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పని చేశారంటే.. ఎంత చురుగ్గా ఉన్నారో చెప్పవచ్చు. ఈ వంటకం కేరళీయులు సాంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి చెందింది. అయితే.. మోడీ ఎంతో ఇష్టంగా తినే ఈ పరాటాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Balakrishna-Boyapati: ‘అఖండ’ కాంబో.. బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్?

రెసిపీ వివరాలు: ముందుగా డ్రమ్‌స్టిక్స్ (మునగకాయలు) ముక్కలుగా కట్ చేసి, అర కప్పు నీళ్లు వేసి ప్రెషర్ కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వాటిని బాగా మాష్ చేసి, వడకట్టాలి. మనకు గుజ్జు మాత్రమే అవసరం. ఆ గుజ్జులో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి, అర టేబుల్ స్పూన్ ఎర్ర మిరప పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, వాము, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. అనంతరం గోధుమ పిండి వేసి ముద్దగా కలపాలి. ముద్ద కలిపేటప్పుడు అదనంగా నీళ్లు వేయకూడదు. ఇప్పుడు ఆ ముద్దతో పరాటాలు చేసుకోవాలి. రుచిని ఇంకా పెంచడానికి పరాటాలు చేస్తూ మధ్యలో కొంచెం కొత్తిమీర ఆకులు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ పరాటాలను పెరుగుతో కలిసి తింటే చాలా రుచిగా ఉంటాయి.

READ MORE: US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..

Exit mobile version