Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papaya Seeds Health Benefits: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా పేరుగాంచింది. అయితే బొప్పాయి తిన్న తర్వాత చాలా మంది దాని గింజలను పనికిరావని భావించి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం బొప్పాయి గింజలు కూడా అనేక పోషక గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బొప్పాయి గింజల్లో పీచు పదార్థం, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో మరియు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
* బొప్పాయి గింజలను ఉపయోగించాలంటే ముందుగా వాటిని పండులో నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. అనంతరం ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత అవి నల్ల మిరియాల్లా కనిపిస్తాయి. వాటిని పొడిలా చేసి సూప్‌లు, సలాడ్లు, పాస్తా వంటి ఆహారాల్లో మసాలా రూపంలో ఉపయోగించవచ్చు.
Also Read
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
* బరువు తగ్గాలని భావించే వారికి కూడా బొప్పాయి గింజలు ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. 4 నుంచి 5 ఎండిన గింజలను మెత్తగా నూరి గోరువెచ్చని నీటిలో కలిపి, అందులో అర నిమ్మరసం మరియు ఒక టీస్పూన్ తేనె వేసి ఉదయాన్నే తీసుకుంటే జీవక్రియ మెరుగుపడటానికి తోడ్పడుతుందని అంటున్నారు.
* అలాగే ఫ్రూట్ స్మూతీలు, గ్రీన్ జ్యూస్‌లు లేదా షేక్‌లలో కొద్దిపాటి బొప్పాయి గింజలను కలిపి తీసుకోవచ్చు. ఇవి పానీయానికి ప్రత్యేక రుచిని అందించడంతో పాటు అదనపు పోషకాలను కూడా అందిస్తాయి.
* తరచుగా అజీర్ణం లేదా కడుపు సమస్యలతో బాధపడేవారు 4 నుంచి 5 తాజా బొప్పాయి గింజలను ఒక టీస్పూన్ తేనెతో కలిపి తీసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.
అయితే బొప్పాయి గింజలను అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందువల్ల వాటిని ఆహారంలో చేర్చే ముందు తప్పనిసరిగా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!