Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic-Onion Chutney Recipe: రెగ్యులర్ ఫుడ్ బోర్ కొట్టినప్పుడు ఏదైనా వెరైటీగా ట్రై చేస్తుంటారు.. ఇక, కొన్నిసార్లు అనుకోని సమయంలో అతిథులు వచ్చినా.. క్షణాల్లో రెడీ అయ్యే వంటకాలపై దృష్టిసారిస్తుంటారు.. ఇక, రోజూ చేసే పచ్చడి, చట్నీలకు భిన్నంగా ఏదైనా రుచి చూడాలనుకుంటున్నారా? అయితే కొండ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వెల్లుల్లి-ఉల్లిపాయ చట్నీని ఇంట్లోనే తయారు చేసుకోండి. వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగుతో తయారయ్యే ఈ చట్నీ పుల్లగా, కారంగా, ఘాటుగా ఉంటుంది. సాదాసీదా భోజనానికి కూడా ఇది మంచి రుచిని అందిస్తుంది. కొండ ప్రాంతపు వంటకాల ప్రత్యేకత వాటి సింప్లిసిటీతో పాటు సహజమైన రుచిలో ఉంటుంది. ఈ చట్నీని రుబ్బురాయిపై దంచి తయారు చేస్తే మరింత రుచిగా ఉంటుంది. రోటీ, పరాటాలతో పాటు పప్పు, అన్నంతో కూడా దీనిని సైడ్ డిష్‌గా వడ్డించవచ్చు.
కావాల్సిన పదార్థాలు
* వెల్లుల్లి రెబ్బలు – 8 నుంచి 10
* వెల్లుల్లి ఆకులు – అర గుప్పెడు
* ఉల్లిపాయ – 1 మధ్యస్థ పరిమాణం
* కొత్తిమీర – ఒక గుప్పెడు
* పచ్చిమిరపకాయలు – 3 నుంచి 4
* ఉప్పు – రుచికి సరిపడా
* ఎర్ర మిరపకారం – అర టీస్పూన్
* పసుపు – అర టీస్పూన్
* ధనియాల పొడి – అర టీస్పూన్
* పెరుగు – అర కప్పు
Also Read
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
టెంపరింగ్ కోసం
* ఆవ నూనె
* ఇంగువ – చిటికెడు
* జీలకర్ర – అర టీస్పూన్
* ఎండు మిరపకాయ – చిటికెడు
వెల్లుల్లి-ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం
ముందుగా వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి ఆకులు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత రుబ్బురాయిపై వెల్లుల్లి, ఉల్లిపాయలను వేసి దంచాలి. అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి ఆకులు వేసి అన్నింటినీ బాగా కలిసేలా రుబ్బాలి. ఇప్పుడు ఎర్ర మిరపకారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పెరుగు వేసి మరోసారి తేలికగా రుబ్బాలి. ఇలా చేయడంతో అన్ని పదార్థాలు కలిసి పేస్ట్‌లా మారతాయి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో ఆవ నూనె వేడి చేసి ఇంగువ, జీలకర్ర, ఎండు మిరపకాయ వేసి తాలింపు పెట్టాలి. సుమారు ఒక నిమిషం తర్వాత సిద్ధం చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి.
రుబ్బురాయిపై చేస్తేనే అసలైన రుచి
ఈ చట్నీకి ప్రత్యేకమైన కొండ ప్రాంతపు రుచి రావాలంటే మిక్సర్‌కు బదులుగా రుబ్బురాయిని ఉపయోగించడం మంచిది. రుబ్బురాయిపై దంచడం వల్ల వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రుచులు చక్కగా కలుస్తాయి. ఇక, ఈ వెల్లుల్లి-ఉల్లిపాయ చట్నీని రోటీ, పరాటాలతో నేరుగా తినవచ్చు. అలాగే పప్పు, అన్నంతో సైడ్ డిష్‌గా కూడా వడ్డించవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఈ చట్నీ భోజనానికి మంచి రుచిని అందిస్తుంది. అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు కూడా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కారం, పులుపు, వెల్లుల్లి రుచులతో ఉండే ఈ చట్నీ సాధారణ భోజనాన్ని కూడా మరింత రుచికరంగా మార్చుతుంది. కొత్తిమీర-పుదీనా చట్నీకి బదులుగా అప్పుడప్పుడు ఈ కొండ ప్రాంత శైలి వెల్లుల్లి-ఉల్లిపాయ చట్నీని ప్రయత్నించవచ్చు.. మీరూ ట్రై చేసి.. ఆ రుచిని ఆస్వాదించండి..
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..