Jamun Benefits in Telugu :బిర్యానీ, పలావ్, లేదా ఘాటైన మసాలా వంటకాలు తింటున్నప్పుడు సైడ్ డిష్‌గా ఉల్లిపాయ రాయితా , బూందీ రాయితా చేసుకోవడం మనకు అలవాటే. కానీ, ఎప్పుడైనా విభిన్నంగా ‘నేరేడు పండ్ల రాయితా’ (Jamun Raita) టేస్ట్ చేశారా? వినడానికి కాస్త కొత్తగా ఉన్నా, ఇది బిర్యానీ కాంబినేషన్‌లోకి ఒక అద్భుతమైన కిక్ ఇస్తుంది. టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా బోనస్ ఇచ్చే ఈ స్పెషల్ రాయితాను ఎలా చేసుకోవాలో, దీనివల్ల వచ్చే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం!
కావలసిన పదార్థాలు:
- చిక్కటి పెరుగు – 1 కప్పు
- గింజలు తీసేసి, సన్నగా తరిగిన అల్లనేరేడు పండ్ల ముక్కలు – 1/2 కప్పు
- వేయించిన జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
- నల్ల ఉప్పు (Black Salt) – రుచికి సరిపడా
- పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా
- సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా
సూపర్ ఈజీ.. తయారీ విధానం:
మొదట ఒక గిన్నెలో చిక్కటి పెరుగును తీసుకుని ఉండలు (lumps) ఏమీ లేకుండా స్పూన్‌తో లేదా బ్లెండర్‌తో బాగా చిలకండి.
ఆ మెత్తటి పెరుగులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లనేరేడు పండ్ల ముక్కలను వేయండి.
ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, లైట్‌గా పచ్చిమిర్చి ముక్కలు , సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేయండి.
అంతే.. కలర్‌ఫుల్‌గా ఉండే నోరూరించే ‘నేరేడు పండ్ల రాయితా’ రెడీ!
ఆరోగ్యానికి ఎందుకంత మంచిదంటే?
మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు కడుపులో మంటగా అనిపించడం సహజం. పెరుగు మన శరీరానికి చలవ చేస్తుంది. అలాగే, నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి, అలాగే తిన్న ఆహారం త్వరగా అరిగేలా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో బాగా సహాయపడతాయి.
సో.. నెక్స్ట్ టైమ్ మీ ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు రొటీన్ రాయితా కాకుండా, ఈ హెల్తీ అండ్ టేస్టీ ‘జామున్ రాయితా’ ట్రై చేసి ఇంట్లో వాళ్లకు ఒక స్వీట్ అండ్ స్పైసీ సర్ప్రైజ్ ఇచ్చేయండి..!
