Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instant Onion Mixture: సాయంత్రం పూట ఏదైనా పుల్లగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తే.. పెద్దగా కష్టపడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే కేవలం రెండు నిమిషాల్లో ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఆ స్నాక్ మరేదో కాదు.. అదే నోరూరించే ‘ఉల్లి మిక్చర్’ (Ulli Mixture). ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని సాయంత్రాల్లో ఈ స్నాక్ తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ రుచితో, ఎంతో హెల్తీగా ఇంట్లోనే దీనిని ఎలా రెడీ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
మందం అటుకులు (Thick Poha) – 1 కప్పు
వేరుశనగ గుళ్ళు (Peanuts) – పావు కప్పు
ఉల్లిపాయలు (పెద్దవి) – 2 (సన్నగా తరిగినవి)
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1 స్పూన్
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1 స్పూన్
చాట్ మసాలా – 1 స్పూన్
కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
నెయ్యి – 1 స్పూన్
నిమ్మకాయ – 1
నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అటుకులు వేసి వేయించుకోవాలి (నూనె సరిగ్గా కాగకపోతే అటుకులు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, తెల్లగా పొంగవు). ఇక్కడ పల్చటి అటుకులు కాకుండా కాస్త మందంగా ఉండే అటుకులను మాత్రమే వాడాలి. చక్కగా పొంగిన అటుకులను తీసి, అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ ఉన్న ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే నూనెలో పావు కప్పు వేరుశనగ గుళ్ళు (పల్లీలు) కూడా వేసి, మాడిపోకుండా దోరగా వేయించి, వాటిని కూడా అటుకులు ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అటుకులు, పల్లీలను ఒకసారి పైకి కిందకి కదిపి, కింద ఉన్న టిష్యూ పేపర్‌ను తీసేయాలి.
ఇప్పుడు ఆ గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా జల్లుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, మిక్చర్‌కు మంచి ఫ్లేవర్, రుచిని అందించడం కోసం ఒక స్పూన్ నెయ్యి, ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో గట్టిగా కలుపుతూ ఉల్లిపాయల్లోని తడి అటుకులకు పట్టేలా బాగా కలపాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి రుచి చూసి, మీ అవసరానికి తగినట్లుగా ఉప్పు, కారం లేదా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే.. ఎంతో రుచికరమైన, నోటికి పుల్లపుల్లగా కారకారంగా ఉండే హోమ్మేడ్ ఉల్లి మిక్చర్ రెడీ అయిపోయింది.
సాధారణంగా రోడ్డు పక్కన బండి మీద అమ్మేవాళ్ళు అయితే ఇందులో ఉడికించిన అరటికాయ ముక్కలు, మిర్చి బజ్జీ ముక్కలు లేదా టమాటా బజ్జీ ముక్కలను కూడా కట్ చేసి కలుపుతుంటారు. మీకు మరింత స్ట్రీట్ స్టైల్ రుచి కావాలనుకుంటే, ఇంట్లో బజ్జీలు ఉన్నప్పుడు వాటిని కూడా ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుకోవచ్చు. కానీ కేవలం ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఇంగ్రిడియంట్స్‌తో చేసినా కూడా ఈ ఉల్లి మిక్చర్ అద్భుతమైన రుచిని ఇస్తుంది. కుదిరితే ఈరోజే మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!