Site icon NTV Telugu

Ragi Ponganalu: బిజీ మార్నింగ్‌కు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ఇన్‌స్టంట్ రాగి గుంత పొంగనాలు

Instant Ragi Gunta Ponganalu

Instant Ragi Gunta Ponganalu

Instant Ragi Gunta Ponganalu Recipe: ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది టిఫిన్‌ను స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్‌లో అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి కొందరు అల్పహారంలో ఎలాంటి వంటకాన్ని ఎంచుకోవాలి? అనే సందేహంలో ఉంటారు. అలాంటి వాళ్లకు ఓ మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రోజు మొదలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యం. పైగా ఇది పిల్లలకు నచ్చాలి, పెద్దలకూ సులభంగా ఉండాలి, వండటానికి టైమ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ కలగలిపే వంటకం ఇన్‌స్టంట్ రాగి గుంత పొంగనాలు (అప్పె). తినడానికి క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే ఈ వంటకం ఒకసారి ట్రై చేస్తే ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది.

READ MORE: RAPO : బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని సినిమా క్యాన్సిల్

గుంత పొంగనాలు అంటే దక్షిణ భారత వంటల్లో ఒక ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్. సాధారణంగా అయితే నానబెట్టడం, పులియబెట్టడం ఇలా చాలా ముందే ప్లాన్ చేయాలి. కానీ ఈ రెసిపీ అలా కాదు. తక్కువ టైమ్ లో ఈజీగా చేసుకోవచ్చు. రాగి, రవ్వ, పెరుగు, కూరగాయలతో తయారవుతుందికాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ మూడు పుష్కలంగా ఉంటాయి. ఈ ఇన్‌స్టంట్ గుంత పొంగనాలులో బయట క్రిస్పీనెస్ రావడానికి రవ్వ చాలా ఉపయోగపడుతుంది. లోపల మృదుత్వం రావడానికి రాగి, పెరుగు ఉపయోగపడతాయి. ఇందుకోసం సాధారణంగా ఇంట్లో ఉన్న బాంబే రవ్వనే వాడుతారు. సాంప్రదాయ గుంత పొంగనాలుతో పోలిస్తే ఇది కొంచెం తేడాగా అనిపించవచ్చు. ఎందుకంటే పులియబెట్టిన పిండికి వచ్చే రుచి వేరు. కానీ ఈ ఇన్‌స్టంట్ రాగి గుంత పొంగనాలు రుచి మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది. తయారీ విధానానం గురించి తెలుసుకుందాం..

READ MORE: Vizag Fleet Review 2026: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణ.!

తయారీ విధానం..
మొదట పెద్ద గిన్నెలో సమాన మోతాదులో రవ్వ, రాగి పిండి తీసుకోవాలి. అందులో పెరుగు వేసి బాగా కలపాలి. పిండి ఎక్కువ గట్టిగా లేదా పలుచగా కాకుండా చూసుకోవాలి. కలిపిన తర్వాత 15–20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ టైమ్‌లో రవ్వ మెత్తబడుతుంది. ఆలోపల కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. ఉల్లి, క్యారెట్, క్యాప్సికమ్, ముల్లంగి ఆకులు లేదా పాలకూర లాంటి ఆకుకూరలు బాగా సరిపోతాయి. కొంచెం అల్లం, కరివేపాకు వేస్తే వాసన అద్భుతంగా ఉంటుంది. అనంతరం.. వెంటనే పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు, ఉల్లి వేసి మెత్తబడే వరకు వేయించాలి. మిగతా కూరగాయలు వేసి ఉప్పు, కారం వేసి కొద్దిగా ఉడికించాలి. చివరగా ఆకుకూరలు వేసి ఓ నిమిషం కలిపి దించాలి. ఇవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు.

READ MORE: Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..

ఇప్పుడు పిండిని చూసుకోవాలి. రవ్వ ఉబ్బి పిండి కొంచెం గట్టిగా అయి ఉంటుంది. ఇందులో ఉప్పు, కారం, ఉంటే పచ్చడి పొడి (పొడి) వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది. తర్వాత కూరగాయలు వేసి కలపాలి. చివరగా బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా కలిపి రెండు నిమిషాలు ఉంచాలి. గుంత పొంగనాలు పాన్ వేడెక్కాక ప్రతి గుంటలో కొద్దిగా నూనె వేసి పిండిని నింపాలి. మూత పెట్టి 2–3 నిమిషాలు ఉడికించాలి. కింద భాగం బంగారు రంగులోకి రాగానే జాగ్రత్తగా తిప్పాలి. మళ్లీ కొద్దిగా నూనె వేసి ఇంకో 2–3 నిమిషాలు ఉడికించాలి. టూత్‌పిక్ గుచ్చితే శుభ్రంగా బయటకు వస్తే అవి రెడీ అయినట్టే. వేడి వేడిగా ఈ రాగి పనియారాలను పచ్చి చట్నీతో, కొబ్బరి చట్నీతో లేదా టమాటో కారం చట్నీతో తింటే రుచి మాటల్లో చెప్పలేం. ఆరోగ్యం, రుచితో పాటు సులువుగా తయారు చేసుకునే ఈ ఇన్‌స్టంట్ రాగి గుంత పొంగనాలు తప్పకుండా ట్రై చేయండి.

Exit mobile version