Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Instant Oats Idli Recipe Healthy Breakfast

Instant Oats Idli Recipe: బియ్యం లేకుండా హెల్తీ ఇడ్లీ.. 15 నిమిషాల్లో ఓట్స్‌తో మృదువైన ఇన్‌స్టంట్ ఇడ్లీలు రెడీ!

Published Date :February 12, 2026 , 8:24 am
By RAMAKRISHNA KENCHE
Instant Oats Idli Recipe: బియ్యం లేకుండా హెల్తీ ఇడ్లీ.. 15 నిమిషాల్లో ఓట్స్‌తో మృదువైన ఇన్‌స్టంట్ ఇడ్లీలు రెడీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Instant Oats Idli Recipe: ఉదయం లేవగానే మహిళలు టిఫిన్ చేయడం ఓ పెద్ద పని. కుటుంబం మొత్తం సంతోషంగా కడుపు నిండా తినాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అలాగే తాను చేసిన టిఫిన్ హెల్తీగా ఉండాలని తాపత్రయపడుతుంది. ఇప్పుడు మనం బెస్ట్, హెల్తీ టిఫిన్ రెసిపీని ట్రై చేద్దాం. సాధారణంగా ఇడ్లీ అంటే బియ్యం, మినప్పప్పుతో పిండిని నూరి, పులియబెట్టి ఆవిరిలో వండి తయారు చేస్తాం. ఇందుకు భిన్నంగా ఉండే ఇన్‌స్టంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ గురించి తెలుసుకుందాం.. ఓట్స్ ఇడ్లీకి పులియబెట్టే అవసరం లేదు. ఓట్స్ పొడి, రవ్వ, పెరుగు, కొంచెం కూరగాయలు, మసాలాలు వేసి వెంటనే పిండిని తయారు చేసి, అందులో సోడా లేదా ఇనో వేసి ఆవిరిలో వండేస్తాం. అదే పులియబెట్టిన పిండిలా మృదువుగా ఉబ్బి వస్తుంది. ఇన్‌స్టంట్ టిఫిన్‌లో ఓట్స్ ఇడ్లీ బెటర్ అని చెప్పొచ్చు.

READ MORE: India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్!

తయారీ విధానం..
ఓట్స్ ఇడ్లీలు తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకుని మిక్సీలో కొద్దిగా పొడిగా చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ముదురు ముదురు గానే ఉండాలి. తరువాత పాన్‌లో నూనె లేదా నెయ్యి వేడి చేసి, ఇష్టమైతే జీడిపప్పు వేయించి పక్కన పెట్టాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం వేసి వేగించాలి. ఇప్పుడు రవ్వ వేసి కొద్దిగా వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఓట్స్ పొడి కలిపి మళ్లీ కొద్దిసేపు వేయించాలి. ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్లు, పావు కప్పు పెరుగు వేసి మందమైన పిండిలా కలపాలి. ఇది 5–8 నిమిషాలు అలాగే ఉంచితే కొంచెం గట్టిపడుతుంది. ఇంతలో ఇడ్లీ కుకర్‌లో నీళ్లు వేసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి, అవసరమైతే ఇంకొంచెం నీళ్లు వేసి ఇడ్లీ పిండి మాదిరిగా గట్టిగా కానీ మృదువుగా ఉండేలా చేయాలి. చాలా పల్చగా ఉండకూడదు. ముద్దలు లేకుండా సాఫ్ట్‌గా కలపాలి. తరువాత తురిమిన క్యారెట్, కొత్తిమీర కలపాలి. చివరిగా అర టీస్పూన్ సోడా లేదా ఒక టీస్పూన్ ఇనో వేసి మెల్లగా కలపాలి. ఎక్కువగా కలిపితే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. వెంటనే ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోయాలి. ఆలస్యం చేయకూడదు. నీళ్లు బాగా మరిగుతున్నప్పుడు ప్లేట్లు పెట్టి సుమారు 10–12 నిమిషాలు ఆవిరిలో వండాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కర్ర పెట్టి చూస్తే అది శుభ్రంగా బయటకు వస్తే సరిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చెంచాతో తీసి ప్లేట్‌లో పెట్టాలి. వేడివేడిగా టమాటా చట్నీ లేదా ఇడ్లీ సాంబార్‌తో వడ్డిస్తే ఆద్భుతంగా ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • easy Indian breakfast
  • healthy breakfast recipe
  • Instant oats idli recipe
  • instant tiffin ideas
  • oats idli without fermentation

తాజావార్తలు

  • Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

  • Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?

  • Shashi Tharoor: పాక్-అమెరికా రిలేషన్ ఇదేనా..? మధ్యవర్తిత్వంపై థరూర్ సెటైర్లు..

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions