Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Instant Milk Bread Dessert Recipe 10 Minute Sweet At Home

Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

Published Date :March 20, 2026 , 2:18 pm
By Shiva Ganesh
Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Milk Bread Dessert: ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నా లేదా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా.. తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంగ్రిడియంట్స్ తో చేసుకునే అద్భుతమైన రెసిపీ ఈ ‘మిల్క్ బ్రెడ్ డెసర్ట్’. కేవలం రెండు కప్పుల పాలు, కొన్ని బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు, వంటరాని వాళ్ళు కూడా దీనిని ఎంతో సులువుగా తయారు చేయవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

దీనికి కావలసిన పదార్థాలు..
పాలు: 2 కప్పులు (అర లీటర్ – వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్)

బ్రెడ్ స్లైసెస్: 6 నుంచి 8

కస్టర్డ్ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు (వెనిలా ఫ్లేవర్)

పంచదార: 4 టేబుల్ స్పూన్లు (కస్టర్డ్ కోసం) + 1/4 కప్పు (షుగర్ సిరప్ కోసం)

నెయ్యి: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి: 1/2 టీస్పూన్

డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా (సన్నగా తరిగినవి)

ఫ్లేవర్ కోసం: కుంకుమపువ్వు, రోజ్ వాటర్, ఎండిన గులాబీ రేకులు (ఆప్షనల్)

తయారీ విధానం ఇదే..
మొదట స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో అర లీటర్ పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. ఈలోపు ఒక చిన్న బౌల్‌లో కస్టర్డ్ పౌడర్ తీసుకుని, కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. పాలు మరిగాక, మంట తగ్గించి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో వేస్తూ కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆపేసి, దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి నాలుగు వైపులా ఉండే బ్రౌన్ పార్ట్‌ను కట్ చేసి, ఒక్కో బ్రెడ్ ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. అనంతరం పాన్‌లో నెయ్యి వేసి ఈ బ్రెడ్ ముక్కలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పావు కప్పు పంచదార, అర కప్పు నీళ్లు పోసి కరిగించాలి. ఇందులో మంచి సువాసన కోసం రోజ్ వాటర్, గులాబీ రేకులు వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. ఈ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేయించిన బ్రెడ్ ముక్కలను అందులో డిప్ చేసి వెంటనే తీసేయాలి.

తరువాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మొదట ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేయాలి. దానిపై షుగర్ సిరప్‌లో ముంచిన బ్రెడ్ ముక్కలను అమర్చాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసిన తర్వాత పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. ఈ డెసర్ట్‌ను తయారు చేసిన 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే బ్రెడ్ ముక్కలు కస్టర్డ్ ని పీల్చుకుని చాలా బాగుంటాయి. బ్రెడ్ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు ఇష్టమైతే దీనిని ఫ్రిజ్‌లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటూ ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ సమయంలో, అత్యంత రుచికరంగా తయారయ్యే ఈ ప్రీమియం డెసర్ట్‌ని మీరు కూడా టైం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి.

READ ALSO: Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10-minute dessert recipes
  • Easy bread custard pudding
  • Instant bread sweet
  • Milk Bread Dessert recipe
  • Quick homemade sweets with milk.

తాజావార్తలు

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

  • Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions