Rice Vadiyalu: అన్నం మిగిలిపోతే అస్సలు పడేయకండి.. ఇలా చేస్తే అదిరిపోయే రైస్ పాపడ్స్ రెడీ అవుతాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Vadiyalu: సాధారణంగా చాలా మంది రాత్రి పూట అన్నం మిగిలిపోతే పడేయడం చేస్తుంటారు. కానీ ఆ మిగిలిన అన్నంతో ఎంతో రుచికరమైన, కరకరలాడే వడియాలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. సింపుల్‌గా రాత్రి అన్నంతో అదిరిపోయే రైస్ పాపడ్స్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు..
Also Read
- Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
తయారీ విధానం ఇదే:
ముందుగా మిగిలిన అన్నాన్ని మిక్సీలో వేసి, తగినంత నీరు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరగబెట్టాలి. అనంతరం నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం పేస్ట్‌ను అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి.
తర్వాత ఉడికిన ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బట్టపై చిన్నచిన్న వడియాలుగా వేసుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత, వేడి నూనెలో వేయిస్తే తెల్లగా, కరకరలాడుతూ వస్తాయి. ఇలా చేస్తే ఆహారాన్ని వృథా చేయకుండా, ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, రుచికరమైన వడియాలను తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో సులభంగా చేసుకునే ఈ ‘రైస్ పాపడ్స్’ భోజనంలోకి నంజుకోవడానికి ఎంతో బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
READ ALSO: Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!