NTV Telugu Site icon

Cholesterol Controlling:ఈ టిప్స్ పాటిస్తే .. కంట్రోల్ లో కొలెస్ట్రాల్..!

Colostor

Colostor

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోకండి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అయితే చాలా మంది ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

నిజానికి కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు నుండి ఎన్నో సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా ఉండాలన్న కొలెస్ట్రాల్ వల్ల మీకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలన్నా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇబ్బంది ఉండదు.

రెడీ టు కుక్ చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉండే ఇటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

వ్యాయామం చేయకపోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లివర్ సమస్యలు కూడా పెరుగుతాయి. అలానే బరువు కూడా పెరిగి పోతూ ఉంటారు కొలెస్ట్రాల్ సమస్య ఉండకుండా ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయండి.

ఆల్కహాల్ సేవించడం, స్మోకింగ్ చేయడం, అధిక ఒత్తిడి కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అలానే జంక్ ఫుడ్ ని తీసుకోకుండా ఉండండి. ఇలా మీరు రెగ్యులర్ గా ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కొలెస్ట్రాల్ సమస్య ఉండదు అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Si Suicide Case: ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యపై విచారణ