Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadai Roti Recipe: రోజూ ఒకే రకమైన అల్పాహారాలు తింటూ బోర్‌గా అనిపిస్తోందా? అయితే ఈసారి రుచికరమైన, ఆరోగ్యకరమైన కడాయి రోటీని ట్రై చేయండి. సాధారణ రోటీలకు భిన్నంగా ఉండే ఈ ప్రత్యేక వంటకం జార్ఖండ్‌లోని రాంచీ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. మినపపప్పు, శనగపప్పు, బియ్యంతో తయారయ్యే ఈ రోటీ రుచిలో ప్రత్యేకతతో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఉదయం వేళల్లో తక్కువ సమయంలోనే సులభంగా తయారుచేసుకునే ఈ కడాయి రోటీ కుటుంబ సభ్యులందరికీ నచ్చే అల్పాహారంగా మారుతుంది. తక్కువ నూనెతో తయారయ్యే ఈ వంటకం కరకరలాడే టెక్స్చర్తో మరింత రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
* 1/2 కేజీ బియ్యం
* 250 గ్రాముల శనగపప్పు
* 250 గ్రాముల మినపపప్పు
* కొద్దిగా జీలకర్ర పొడి
* కొద్దిగా కారం పొడి
* తగినంత ఉప్పు
* వేయించడానికి కొద్దిగా నూనె
Also Read
- Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
- Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
- Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ 'పండు మిరపకాయ పచ్చడి'.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
- Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్‌తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!
తయారీ విధానం
* ముందుగా బియ్యం, శనగపప్పు, మినపపప్పులను శుభ్రంగా కడిగి కనీసం ఐదు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. కావాలనుకుంటే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. తరువాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
* ఈ మిశ్రమంలో ఉప్పు, జీలకర్ర పొడి, కారం పొడి వేసి బాగా కలపాలి. అనంతరం ఇనుప పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. తయారుచేసుకున్న పిండిని పెనంపై పోసి గుండ్రంగా పరచాలి.
* మధ్యస్థ మంటపై సుమారు ఐదు నిమిషాల పాటు కాలనివ్వాలి. రోటీ పెనం నుంచి సులభంగా విడిపోవడం మొదలైతే మరో వైపు తిప్పి 20 నుంచి 30 సెకన్ల పాటు వేయించాలి. అంతే.. రుచికరమైన కడాయి రోటీ సిద్ధం.
* ఈ రోటీని కొబ్బరి చట్నీ, వేరుశెనగ చట్నీ లేదా చోఖాతో వేడిగా వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. తక్కువ నూనెతో తయారయ్యే ఈ వంటకం ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా మంచి ఎంపిక అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
-
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!