నేటి జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వాటి వల్ల గుండెలో మంట, నెర్వస్ నెస్, రెస్ట్ లెస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజూ రాత్రిపూట ఒక గ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే.. అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సెలరీ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Japanese Encephalitis: 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో నమోదైన ప్రాణాంతక వ్యాధి..
సెలెరీ రసం ప్రయోజనాలు:
ఆకుకూరల వాడకం రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది కాస్త కొత్తిమీరలా కనిపిస్తుంది. సెలెరీలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సెలెరీలో విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్ వంటి మంచి పోషకాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది.
కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం:
సెలెరీ రసాన్ని తగినంత మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దీనిలో థైమోల్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. సెలెరీ రసం కడుపు ఆమ్లాన్ని తటస్తం చేయడానికి సహాయపడుతుంది. ఇది హార్ట్ బర్న్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఆందోళన, విశ్రాంతి లేకపోవడం నుండి ఉపశమనం:
సెలెరీ రసాన్ని తాగితే ఆందోళన, విశ్రాంతి లేకపోవడం నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా సెలెరీ చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా.. ఆకుకూరలు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఇది.. మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
వ్యాధుల నివారణ:
సెలెరీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంటను నివారిస్తుంది.. వ్యాధులను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి మరియు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో అపియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అల్సర్, జీర్ణక్రియ వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది. అధ్యయనాల ప్రకారం, సెలెరీ రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ నియంత్రణలో ఉంటాయి:
సెలెరీ గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ కేలరీల ఆకు. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఆకలిని తగ్గిస్తుంది. సెలెరీలో అపిజెనిన్, లుటియోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలు దీనిలో ఉన్నాయి. ఈ జ్యూస్ ను తరచుగా తాగితే క్యాన్సర్ ముప్పు దూరం అవుతుంది.