Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Ridge Gourd Tikki Recipe: ప్రతిరోజూ సమోసా, బజ్జీలు, కచోరీలతో బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఆరోగ్యకరమైన, రుచికరమైన బీరకాయ టిక్కీలను ట్రై చేయండి. బీరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ టిక్కీలను ఎంతో ఇష్టంగా తింటారు. ఫైబర్, విటమిన్లు, నీరు సమృద్ధిగా ఉండే బీరకాయ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు
* రెండు బీరకాయలు
* ఒక మధ్యస్థ పరిమాణం బంగాళదుంప
* అర కప్పు శనగపిండి
* పావు కప్పు బ్రెడ్‌క్రంబ్స్
* పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ
* పావు కప్పు కొత్తిమీర
* పావు టీస్పూన్ తురిమిన అల్లం
* పావు కప్పు నిమ్మరసం
* అర టీస్పూన్ జీలకర్ర
* అర టీస్పూన్ ధనియాల పొడి
* అర టీస్పూన్ గరం మసాలా
* ఒక టేబుల్ స్పూన్ తురిమిన చీజ్
* తగినంత ఉప్పు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తయారీ విధానం
ముందుగా బీరకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. బంగాళదుంపలను ఉడకబెట్టి తురిమి సిద్ధంగా పెట్టుకోవాలి. తురిమిన బీరకాయలోని అదనపు నీటిని పూర్తిగా పిండేయాలి. లేదంటే టిక్కీలు వేయించే సమయంలో విరిగిపోయే అవకాశం ఉంటుంది.
మిశ్రమం ఎలా తయారు చేయాలి?
ఒక గిన్నెలో బీరకాయ, బంగాళదుంప, శనగపిండి, బ్రెడ్‌క్రంబ్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, నిమ్మరసం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఉప్పు, చీజ్‌ను చివర్లో మాత్రమే కలపాలి. ఉప్పు ముందే వేస్తే బీరకాయ మళ్లీ నీరు విడిచే అవకాశం ఉంటుంది.
కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి టిక్కీ ఆకారంలో ఒత్తాలి. పాన్‌లో నూనె వేడి చేసి మధ్యస్థ మంటపై ఒక్కో వైపు 3-4 నిమిషాలు వేయించాలి. బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించాలి. అనంతరం టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనె తొలగించాలి.
వేడివేడిగా సర్వ్ చేయండి
తయారైన బీరకాయ టిక్కీలను కొత్తిమీరతో అలంకరించి పుదీనా చట్నీ లేదా మీకు ఇష్టమైన డిప్‌తో వేడివేడిగా వడ్డించండి. ఈ హెల్తీ స్నాక్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?