Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Raw Potato Paratha Recipe: ఉదయం అల్పాహారానికి త్వరగా, రుచికరంగా, కడుపు నిండే వంటకం కావాలంటే పచ్చి ఆలూ పరాఠా మంచి ఎంపిక. సాధారణంగా ఆలూ పరాఠా తయారు చేయాలంటే ముందుగా బంగాళదుంపలను ఉడికించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక రెసిపీలో ఆ అవసరం లేదు. పచ్చి బంగాళదుంపలతోనే కరకరలాడే, రుచికరమైన పరాఠాలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ పరాఠా బయట కరకరలాడుతూ, లోపల మసాలాల రుచితో ఎంతో రుచిగా ఉంటుంది. అల్పాహారంతో పాటు పిల్లల లంచ్‌బాక్స్‌కు, రాత్రి భోజనానికి కూడా ఇది చక్కని ఎంపిక. ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నిస్తే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు అంటే నమ్మండి..
కావలసిన పదార్థాలు (ఇద్దరికి)
* 2 పెద్ద బంగాళదుంపలు
* 2 కప్పుల గోధుమ పిండి
* 4-5 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
* 2 టేబుల్ స్పూన్ల శనగపిండి
* 1 టీస్పూన్ కారం పొడి
* అర టీస్పూన్ పసుపు
* 1 టీస్పూన్ కసూరి మెంతి
* అర టీస్పూన్ సోంపు
* తగినంత ఉప్పు
* కాల్చడానికి నూనె లేదా నెయ్యి
Also Read
- Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
- Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
- Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే 'కరివేపాకు పచ్చడి'.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
- Healthy Winter Breakfast: చలికాలంలో ఆరోగ్యకరమైన అల్పాహారం.. వేడివేడిగా సజ్జల వెజిటబుల్ ఉప్మా!.. 5 నిమిషాల్లో రెడీ..!
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత బంగాళదుంపలను కడిగి తొక్క తీసి తురమాలి. ఈ తురుమును పిండిలో వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సోంపు, కసూరి మెంతి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండిలా కలపాలి. బంగాళదుంపల నుంచి కూడా తేమ వస్తుంది కాబట్టి అవసరమైనంత మాత్రమే నీటిని ఉపయోగించాలి. పిండిపై కొద్దిగా నూనె రాసి, మూతపెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసి, పొడి పిండి చల్లి గుండ్రంగా ఒత్తాలి. వేడి పెనంపై పరాఠాను వేసి రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత నూనె లేదా నెయ్యి రాసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. పరాఠా కరకరలాడేలా వేయించుకుంటే మరింత రుచిగా ఉంటుంది. వేడి వేడి పచ్చి ఆలూ పరాఠాను టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, పెరుగు లేదా ఊరగాయతో వడ్డిస్తే అద్భుతమైన రుచి ఆస్వాదించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచిని అందించే ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
-
Kavya-Anirudh Reception: సీఎం విజయ్‌తో కలిసి రాని సంగీత.. అనిరుధ్-కావ్య రిసెప్షన్లో విడివిడిగా కనిపించిన దంపతులు
-
Vande Bharat Brakes Fail: బ్రేకులు లేకుండానే ‘వందే భారత్’ 463 కి.మీ. ప్రయాణం.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై విచారణ!
-
Cockroaches: ప్రకృతి రాసిన బొద్దింకల కథ!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!