Breakfast Hack : పెన్నం లేకుండానే అదిరిపోయే ఆమ్లెట్.. ఎయిర్ ఫ్రైయర్ మ్యాజిక్ చూడండి.!

  • పెనం అవసరం లేకుండా 10 నిమిషాల్లో రెడీ
  • తక్కువ ఆయిల్‌తో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్
  • వేడి గాలితో సమానంగా ఉడికే ఫ్లఫ్ఫీ టెక్స్చర్
  • సింపుల్ పదార్థాలతో సులభమైన తయారీ విధానం
Omlet

Omlet

Air Fryer Omelette Recipe in Telugu : సాధారణంగా ఆమ్లెట్ వేయాలంటే పెన్నం వేడి చేయడం, ఆయిల్ వేయడం , అది మాడిపోకుండా జాగ్రత్తగా తిరగేయడం (Flip) వంటి పనులు  ఉంటాయి. కానీ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer) ఉంటే ఇవేవీ అవసరం లేదు. కేవలం పది నిమిషాల్లో, తక్కువ ఆయిల్‌తో ఎంతో మెత్తగా, స్పాంజ్ లాంటి ఆమ్లెట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోరుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్.

ఎయిర్ ఫ్రైయర్ ఆమ్లెట్ ఎందుకు ప్రత్యేకం?
పెనం మీద వేసే ఆమ్లెట్ కొన్నిసార్లు అంచులు మాడిపోవడం లేదా మధ్యలో సరిగ్గా ఉడకపోవడం జరుగుతుంది. కానీ ఎయిర్ ఫ్రైయర్‌లో వేడి గాలి (Hot Air) అన్ని వైపులా సమానంగా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఆమ్లెట్ అద్భుతంగా ఉబ్బుతుంది. దీనివల్ల నూనె తక్కువ పడుతుంది , రుచి కూడా రెట్టింపు అవుతుంది.

Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!

కావలసిన పదార్థాలు:

  • గుడ్లు: 2 లేదా 3 (మీ అవసరాన్ని బట్టి).
  • పాలు: ఒక టేబుల్ స్పూన్ (దీనివల్ల ఆమ్లెట్ మరింత సాఫ్ట్‌గా వస్తుంది).
  • కూరగాయలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, క్యాప్సికమ్ లేదా పాలకూర.
  • మసాలాలు: ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కారం (కావాలనుకుంటే).
  • చీజ్: పైన చల్లుకోవడానికి గ్రేటెడ్ చీజ్ (ఆప్షనల్).

తయారీ విధానం:

  • మిక్సింగ్: ముందుగా ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు , మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే తరిగిన కూరగాయ ముక్కలను కూడా వేసి కలపాలి.
  • ప్రిపరేషన్: ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో సరిపోయే చిన్న కేక్ టిన్ లేదా సిలికాన్ బౌల్‌ను తీసుకోండి. దానికి కొద్దిగా నూనె లేదా వెన్న రాయండి.
  • సెట్టింగ్స్: సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి, పైన కొద్దిగా చీజ్ చల్లండి. ఎయిర్ ఫ్రైయర్‌ను 180°C వద్ద సుమారు 8 నుండి 10 నిమిషాల పాటు సెట్ చేయండి.
  • సర్వింగ్: మధ్యలో ఒకసారి చెక్ చేయండి. పైన బంగారు రంగులోకి వచ్చి, లోపల పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీయండి. అంతే! వేడివేడి ఫ్లఫ్ఫీ ఆమ్లెట్ సిద్ధం.

ముఖ్యమైన చిట్కా:

మీరు తీసుకున్న గిన్నె లోతును బట్టి సమయం కొంచెం మారవచ్చు. మొదటిసారి చేసేటప్పుడు 7 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయడం మంచిది. ఆమ్లెట్ పైన మరీ ఎర్రగా కాకుండా ఉండాలంటే లోపలికి గాలి సరిగ్గా తగిలేలా చూసుకోవాలి.

అమెజాన్ సేల్‌లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!