వేసవి కాలం వచ్చిందంటే వేడి, చెమటలు, ఇక చెమటకాయలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే.. అయితే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక సమస్యలు వెంటాడుతుంటాయి.. చెమటకాయలు, దురదలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.. వీటినుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
చర్మ సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనకు కావల్సినంత ముల్తానీ మట్టిని నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి ఇందులో చందనం పొడి వేసి కలపాలి.. ఆ తర్వాత శరీరం పై, ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేసుకుంటే బాగా చల్లగా అవ్వడం మాత్రమే కాదు.. చెమటకాయలు వెంటనే తగ్గిపోతాయి..
ఇక వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వేప నీటితో స్నానం చేయడంతో వేప కాయల రసాన్ని లేదా నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేప ఆకులను పేస్ట్ గా చేసి చర్మంపై కూడా రాసుకోవచ్చు. చివరగా సోడా ఉప్పును కొద్దిగా తీసుకొని నీళ్లు పోసి బాగా కలపాలి.. ఆ మిశ్రమాన్ని దురదలు ఎక్కువగా ఉన్న దగ్గర పూతలాగా రాసుకోవాలి.. ఆరిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే చాలు ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యలు మాయం అవుతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.