బంగాళాదుంపలకు బదులుగా చిలగడ దుంపలను తినడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. అయితే వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారి నుంచి డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇవి ఉపయోగంగా ఉంటాయి.
Read Also:Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య
మన ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చాలా మంది పట్టించుకోరు. అయితే..దుంపలు, ఆమ్లా, చిలకడ దుంపలు మన ఆరోగ్యానికి ఎంతో గానో సహాకరిస్తాయి. అయినప్పటికి వీటిని పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ చిలగడదుంప మన ఆరోగ్యానికి ఒక వరం అని మీకు తెలుసా? ప్రతిరోజూ చిలగడదుంప తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also:Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా..
చలికాలం మార్కెట్లో ఎక్కువగా చిలగడ దుంపలు కనిపిస్తుంటాయి. అయితే ప్రజలు వాటిని కాల్చుకుని తినడం చేస్తుంటారు. దీంతో వాటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. చిలగడదుంపలలో ఉండే సహజ ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన భావనతో ఉంచడానికి సహాయపడుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల, దీన్ని మీ సాయంత్రం చిరుతిండి లేదా అల్పాహారంలో చేర్చుకోవచ్చు.
Read Also:Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..
చిన్న చిలగడదుంపలో విటమిన్లు A, B6, C , మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ A దృష్టికి చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ సమయంలో విటమిన్ సి రక్షణ కవచంగా పనిచేస్తుంది. చిలగడదుంప ముదురు రంగులో ఉంటే, దానిలో బీటా-కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది దానిని మరింత పోషకమైనదిగా చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది . మెదడు వేగంగా పనిచేసేలా చేస్తుంది. ఇది మెదడును ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది కాబట్టి, ఇది న్యూరోడీజెనరేటివ్ వ్యాధులను (అల్జీమర్స్ వంటివి) నివారించడానికి కూడా సహాయపడుతుంది.
