Fitness Tips: సమ్మెర్ లో వర్కౌట్స్ చేసేవారు తప్పక తెలుసుకోవాలి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటి విద్యలు కూటి వరకే.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అందుకే ఆరోగ్యం చాలా ముఖ్యం..అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.. బిజీ లైఫ్ లో కూడా కాస్త సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఔట్‌డోర్ వ్యాయామలు చేయడం, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఆస్కారం ఉంది. అందుకే.. వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాయామం చెయ్యడానికి ఒక సమయం ఉంటుంది.. ఆ సమయంలోనే చెయ్యాలి.. అదే మంచిది.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయం 9 గంటల ముందే వ్యాయామం చేయాలి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళితే మంచిది అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది..
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
వ్యాయామం చేస్తున్నప్పుడు.. శరీరం నుండి చాలా చెమట బయటకు వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. శరీరంలో నీటికొరత ఏర్పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినంత నీరు తాగాలి. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే బదులు.. నీళ్లు తాగితే మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. ఇందులో కొంత తేనె కలుపుకుని కూడా తాగొచ్చు.. అప్పుడే శరీరం డీ హైడ్రెడ్ అవ్వకుండా ఉంటుంది..
వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయొద్దు. వర్కవుట్ సమయంలో చాలా చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరుగుతంది. అలాంటి సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంపై దుష్ప్రభావం పడుతుంది.. ఒంట్లో వేడి తగ్గిన తర్వాత మాత్రమే స్నానం చెయ్యాలి…
వేసవిలో వదులుగా, లేత రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. దీని కారణంగా చర్మానికి గాలి తగులుతుంది. చెమట ఆరిపోతుంది. బిగుతుగా ఉండే, ముదురు రంగు దుస్తులను ధరిస్తే విపరీతమైన వేడి కలుగుతుంది…ఇక ఎనర్జీ లెవల్స్ కోసం ఎటువంటి డ్రింక్స్ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!