Site icon NTV Telugu

Ferty 9 : అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్… లాంచ్ చేసిన నటి ఇంద్రజ

Ferty-9

హైదరాబాద్ : మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని ప్రముఖ సినీ నటి ఇంద్రజ అన్నారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిచడం అభినందనీయమని అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి ఇంద్రజ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించనున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. మాతృత్వం ఒక వరం. ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి, పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయి.

Read Also : Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్

ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వైద్య శాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని సినీ నటి ఇంద్రజ అన్నారు. సంతాన లేని సమస్యల కోసం ఫర్టీ 9 అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పద్దతులను ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అందించేందుకు సిద్ధమైందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్ లలో ఈనెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని వేలమందికి ఐ వి ఎఫ్, ఐ సి ఎస్ ఐ, ఐ ఏం ఎస్ ఐ , ఉచిత వైద్య శిబిరాలను పలు ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహించినట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 9246800055, 95507 21836 ఫోన్ నెంబర్ లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Exit mobile version