ఈ రోజుల్లో జనాలకు డబ్బుల పిచ్చి పట్టుకుంటుంది.. డబ్బులను సంపాదించాలనే కోరికతో కడుపు నిండా భోజనం కూడా చెయ్యట్లేదు..ఎదో బ్రతకాలంటే తినాలి అన్నట్లు ఫాస్ట్ గా తిని వెళ్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఫాస్ట్ గా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫాస్ట్ గా తింటే బరువు కూడా ఫాస్ట్ గా పెరుగుతారట.. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బులు, కడుపులో రకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందట. కొన్ని రెస్టారెంట్లలో స్పీడ్‌గా తినే పోటీలు పెడుతుంటారు. పోటీలో గెలవాలని పాల్గొన్నవారు వేగంగా తింటారు. ఇలాంటి పోటీలు థ్రిల్ ఇస్తాయేమో కానీ.. వేగంగా తినడం ప్రమాదంలో పడేస్తుంది. తరచుగా స్పీడ్‌గా ఆహారం తీసుకోవడం వల్ల అనర్ధాలు కొని తెచ్చుకున్నట్లే.. వేగంగా తినడం వల్ల అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. వేగంగా తినేవారు తక్కువగా నములుతారు. ఓ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తీరికగా తినేవారితో పోలిస్తే వేగంగా తినేవారిలో ఆకలి త్వరగా వేస్తుందట. దాంతో ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువు బారిన పడతారు. ఇక స్పీడ్‌గా ఆహారం తినేవారికి షుగర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
స్పీడ్‌గా ఆహారం తినడం వల్ల ఎరోసివ్ గ్యాస్ట్రిటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో పుండుకి కారణమవుతుందట. స్పీడ్‌గా ఆహారం తినేవారు అతిగా తినడం వల్ల అది త్వరగా జీర్ణమవకుండా ఎక్కువసేపు ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ యాసిడ్‌కు కారణమవుతుందట.. భోజనాన్ని చాలా స్పీడ్ తినడం వల్ల లాభలేమో గానీ అనర్థాలే ఎక్కువ ఉన్నాయి.. అందుకే భోజనానికి కూర్చున్నప్పుడు ఆహారంలోని వాసన, రుచి వంటివాటిని ఆస్వాదిస్తూ తినాలి. పూర్తిగా నమిలి తినాలి. అలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పోషకాలు శరీరాన్ని సరిగా అంది బలాన్ని ఇస్తాయి. ఈ అలవాటు లేనివారు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. నిత్యం ఎన్నో పనుల్లో బిజీగా ఉండేవారు తమ ఆరోగ్యం కోసం తమ శరీర పోషణ కోసం అవసరమైన ఆహారం తినే విషయంలో ఆ మాత్రం సమయం కేటాయించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.. అందుకే నిదానం ప్రధానం అని గుర్తుంచుకోండి..