కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేయవచ్చని, రెగ్యులర్‌గా వ్యాయామం చేసేవారిలో వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీలు 50 శాతం వేగంగా వృద్ధి చేందాయని గ్లాల్గో కాలెడోనియన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
Read: యువకుడి సాహసంః పాముకు ఊపిరిని ఇలా అందించి బతికించాడు…
వ్యాయామం చేయనివారి కంటే రెగ్యులర్‌గా వ్యాయామం చేసేవారిలో యాంటీబాడీలు వేగంగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, వారంలో 5 రోజులపాటు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారిలో వ్యాక్సిన్ సామర్ధ్యం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.