యువ‌కుడి సాహ‌సంః పాముకు ఊపిరిని ఇలా అందించి బ‌తికించాడు…

క‌రోనా కాలంలో మ‌నిషి సాటి మ‌నిషిని ప‌ట్టించుకోవ‌డం మ‌ర్చిపోయాడు.  త‌ను ఉంటే చాలు అనుకుంటున్నాడు.  ప‌రిస్థితులు కూడా అలానే ఉన్నాయి.  ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ యువ‌కుడు చేసిన సాహ‌సం అందరిచేత చ‌ప్ప‌ట్లు కొట్టించింది.  ఓ ప్రాణికి ప్రాణం పోసింది.  ఇంత‌కీ ఆ యువ‌కుడు చేసిన సాహ‌సం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడ‌క అప‌స్మార‌క స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వ‌డ‌మే. అందులో స్పెష‌ల్ ఏముంది అనుకుంటే పొర‌పాటే.

Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి మొబైల్ ఫోన్స్

మాములు మ‌నిషికైతే దానిగురించి అంత‌టి చర్చ జ‌రిగేది కాదు.  ఆ యువ‌కుడు ఊపిరి అందించింది ఓ పాముకు.  ఊపిరి అంద‌క అప‌స్మార‌క స్థితిలో ప‌డున్న పాము నోరు తెరిచి స్ట్రాను ఉంచి ఊపిరి ఊదాడు.  కాసేప‌టికి ఆ పాము తేరుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.  ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింద‌నే విష‌యం తెలియ‌కున్నా, సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్ వైర‌ల్ అవుతున్న‌ది.  పాముకు ఊపిరి అందించిన యువ‌కుడిని నెటిజ‌న్లు శ‌భాష్ అని మెచ్చుకుంటున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-