NTV Telugu Site icon

Can Thyroid Cause Hair Fall : థైరాయిడ్ కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుందా?

Thyroid

Thyroid

ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలా వస్తున్న ఇలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి మన శరీరంలోని అనేక వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. ఈ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో కామన్ గా వచ్చేది ‘హైపో థైరాయిడ్’. ఈ వ్యాధి వస్తే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ తప్పకవాడాల్సి ఉంటుంది.

జుట్టు రాలే సమస్య విపరీతం..
ఇవేకాకుండా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న చాలా మందిలో జుట్టు రాలే సమస్య విపరీతంగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు జీవనశైలి, ఆహారపుటలవాట్లు, జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

థైరాయిడ్​ కంట్రోల్​లో లేనపప్పుడు​ తలమీద వెంట్రుకలు..
థైరాయిడ్​ కంట్రోల్​లో లేనపప్పుడు​ తలమీద వెంట్రుకలు ఎదిగే ప్రదేశంపై ప్రభావం పడుతుందట. దానివల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది. అలాగే జుట్టు పల్చగా మారుతుంది. దీన్నే డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ ఫాల్, డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ గ్రోత్ అని అంటుంటారు. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్​లో దీన్ని గుర్తించి మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు హెయిర్​ ఫాల్ అనేది జరగకుండా చూసుకోవచ్చంటున్నారు.

ఇవి లోపించినా హెయిర్ ఫాల్

ఇకపోతే కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాంటి వారిలో విటమిన్ డి, కాల్షియం లోపం కారణంగా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి అలాంటివారు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే.. చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్, కొన్ని గింజ ధాన్యాలు వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్​లో చేర్చుకోవాలి. అదే థైరాయిడ్ కంట్రోల్​లో ఉండి విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలివే…
జుట్టు సంరక్షణ విషయంలోనూ తలస్నానం మొదలు దువ్వడం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అందులో కొన్నింటిని చూస్తే.. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలట. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు కొబ్బరి నూనె పెట్టుకోవడం మంచిదంటున్నారు. అలాగే తలను పదే పదే దువ్వడం, హెయిర్ డ్రైయర్​లను వాడడం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిడి, ఆందోళన వంటివి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్​లో ఉండడమే కాకుండా జుట్టు రాలడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.