Site icon NTV Telugu

Health Tips: టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ లుక్ వేయండి

Eating Late At Night

Eating Late At Night

Health Tips: టైంకి తింటున్నారా లేదా.. ఎందుకైనా మంచింది ఇప్పటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో సిటీలో అర్ధరాత్రి పూట తినడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలుసా రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఏడు లోపే ముగించాలని మరీమరీ చెప్తున్నారు.

READ ALSO: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ లివ్’

అన్నీ లేట్ అవుతాయ్ జాగ్రత్త..
రాత్రిళ్లు లేట్‌గా తినడం వల్ల నిద్ర లేట్ పడుతుంది. దీంతో పొద్దున్నే మెలకువ లేట్‌గా వస్తుంది. దాంతో లంచ్ టైంకు సరిగా ఆకలేయదు. అలా లంచ్ టైం కూడా ముందుకు జరుగుతుంది. ఈ మార్పులన్నీ తెలియకుండానే శరీరంలో జరిగిపోతాయి. చూశారా రాత్రి లేట్‌గా తినడం అనే ఒక్క అలవాటు ఎన్ని సమస్యలకు కారణం అవుతుందో. మీకు తెలుసా శరీరంలో కూడా అంతే… శరీరంలో ఒక కనిపించని క్లాక్ ఉంది. రోజూ తినే టైం, పడుకునే టైంను ఈ గడియం క్యాలిక్యులేట్ చేస్తూ.. దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. చిన్నప్పుడు అన్ని సరైన సమయానికి అవుతుండేవి.. కానీ పెద్దయ్యే కొద్దీ లైఫ్ స్టైల్‌లో మార్పులు రావడంతో శరీరంలోని టైం టేబుల్ కాక కన్​ఫ్యూజ్ అవుతుంది. దీంతో బాడీ బ్యాలెన్స్ తప్పి అనేక సమస్యలు వస్తున్నాయి..

రాత్రి ఏడు గంటలలోపే తినడం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉదయం నిద్ర లేచిన గంట రెండు గంటల్లోపు అంటే 8, 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్, రాత్రి ఏడు లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమయాల్లో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంతగా నష్టం ఉండదు. బరువు పెరగడం.. పొట్ట రావడం లాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. రోజు మొత్తంలో చేసే భోజనంలో బ్రేక్​ఫాస్టే ముఖ్యమైంది. రాత్రి భోజనం లైట్‌గా, తేలికగా జీర్ణయమ్యేలా ఉండాలంటున్నారు నిపుణులు. తిండి సరైన సమయంలో తీసుకుంటే పోషకాహార లోపం రాదని, రక్తహీనత, అజీర్తి, గుండెలో మంట, కడుపులో నొప్పి, ఎముకలు, కండరాల సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

READ ALSO: Tejas Mk-1A: అక్టోబర్‌లో నింగిలోకి తేజస్ మార్క్.. ఇక శత్రు దేశాలకు వణుకే..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version