Cancer with Eating Meat: ప్రతి రోజు వెజ్ వంటకాలే ఏం తింటాం..? అప్పుడప్పుడు నాన్ వెజ్ ఉండాలి కదా..? చికెన్ ఇష్టంగా లాగించాలి.. మటన్ మస్తుగా తినాలి.. ఫిష్ లొట్టలేసుకుంటూ రుచి చూడాలని చాలా మంది భావిస్తారు.. ఇదే సమయంలో.. నాన్ వెజ్ తింటే అంతే..! దాంతో.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు కూడా ఉన్నాయి.. అంతే కాదు నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందనే భయలు వెంటాడుతున్నాయి.. అయితే, దీనిలో నిజమెంతా? అనేది ఓ అధ్యయనం బయటపెట్టింది.. ఇటీవలి వెలువడిన ఓ కథనం ప్రపంచవ్యాప్తంగా మాంసాహారుల నోరు మరింత ఊరేలా చేసింది.. గత అధ్యయనాల్లోని వివరాలను మరోసారి విశ్లేషించడం ద్వారా వెలువరించిన నివేదిక ఆధారంగా ఆ కథనం రాసుకొచ్చారు.. జంతు మాంసం తినడం తగ్గించుకోవాలని చెప్పే అనేక అధ్యయనాలు, అంతర్జాతీయంగా ఆమోదం ఉన్న ఆరోగ్య మార్గదర్శకాలను అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని పేర్కొంది తాజా నివేదిక.
Read Also: Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!
అంటే, జంతుమాంసం తినడం తగ్గించడమనేది జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలను ప్రభావితం చేస్తుందనడానికి అనిశ్చిత ఆధారాలున్నాయని లేటెస్ట్ స్టడీ పేర్కొంది.. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి ముప్పు అనడానికీ సరైన ఆధారాలు లేవని తేల్చేసింది.. 60 లక్షల మందిపై చేసిన 70 వేర్వేరు అధ్యయనాల ఫలితాలను విశ్లేషిస్తూ తాజా నివేదిక రూపొందించారు. జంతు మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కలిగే ముప్పుపై ఇటీవల కాలంలో అనేక నివేదికలు సందేహాలు వ్యక్తంచేశాయి. ప్రాసెస్డ్ మీట్ నిల్వ ఉండేందుకు వినియోగించే నైట్రేట్లు.. నైట్రైట్ల వినియోగానికి వ్యతిరేకంగా గతంలో కొంతమంది శాస్త్రవేత్తలు, పొలిటికల్ లీడర్లు ప్రచారం నిర్వహించారు.. ఈ నైట్రోసమైన్లు పేగు క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. నైట్రైట్లు, అమైన్లతో కలిసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని.. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారపదార్థాల్లో ఈ అమైన్లు ఉంటాయని.. ఆ కారణంతో కూరగాయల్లోని నైట్రైట్లు, నైట్రేట్ల కంటే జంతు మాంసంలోని నైట్రైట్లు, నైట్రేట్లతో ముప్పు ఎక్కువని ప్రచారం సాగింది.. కానీ, శాకాహారాన్నైనా అధిక ఉష్ణోగ్రతల్లో వండినప్పుడు నైట్రోసమైన్లు ఏర్పడతాయి. అంటే ఆహారాన్ని ఎలా తయారుచేస్తున్నామన్న అంశంతోనూ నైట్రోసమైన్లు, దానివల్ల క్యాన్సర్ ముప్పు ముడిపడి ఉంటుంది. కాబట్టి ఏం వండుతున్నాం అనేదాని కంటే ఎలా వండుతున్నామన్నదీ ఈ ముప్పుల స్థాయిని నిర్దేశిస్తుందని.. జంతుమాంసంతో ముప్పు ఎక్కవగా ఏమీ లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణగా పేర్కొన్నారు.
Read Also: Akkineni Nagarjuna: యాడ్స్ సరే.. సినిమా ఎప్పుడు..?
మరోవైపు, మనం తీసుకునే ఆహారంలో హానికరమైనవాటికి ప్రత్యామ్నాయాలు ఏం తీసుకుంటామన్నది కూడా ఇక్కడ కీలకం.. మాంసాహారంలోని సంతృప్త కొవ్వులు గుండె జబ్బులతో సహా అనేక రోగాలకు కారణమవుతాయి. అలా అని సంతృప్త కొవ్వులకు బదులు చక్కెర, పిండిపదార్ధాలను ఎక్కువగా తీసుకున్నామనుకోండి, అది గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచేస్తోంది.. కానీ, సంతృప్త కొవ్వులున్న ఆహారానికి బదులు పాలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు. అంటే, జీవ నూనెలకు బదులు, కొవ్వులకు బదులు సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివి వాడడం మంచిదని తేల్చారు. పందిమాంసానికి పేగు క్యాన్సర్‌కు సంబంధం ఉందనే అపోహలు ఉండగా.. ఇలాంటివి చాలా అరుదని నివేదిక పేర్కొంది.. ప్రతి వెయ్యి మందిలో 56 మందికి మాత్రమే జీవితకాలంలో ఇలాంటి క్యాన్సర్ ముప్పు ఉంటుందని స్పష్టం చేసింది..
<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>