NTV Telugu Site icon

Aluminum Foil: అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్

Aluminium Foil

Aluminium Foil

ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్‌ను ప్యాకింగ్ చేయడానికి రెస్టారెంట్లతో పాటు.. ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం కవర్స్‌లో చుట్టబడిన రోటీస్ కానీ.. ఇతర వస్తువులు చాలా సమయం పాటు వేడిగా, తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం కవర్స్‌ వాడకం మన ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారాన్ని వండడానికి అల్యూమినియం పాత్రలు, ప్యాకింగ్‌కు అల్యూమినియం ఫాయిల్‌లు విరివిగా వినియోగిస్తున్నారని.. అయితే ఇది మన ఆరోగ్యానికి అనేక హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?

అల్యూమినియం మన ఆరోగ్యానికి హానికరం అనే దానిపై అనేక పరిశోధనలు చేశారు. ఆహారాన్ని పండించే నేల, వంట చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే పాత్రల ద్వారా అల్యూమినియం మన శరీరంలోకి చేరుతోంది. అది మలం, మూత్రం ద్వారా అటువంటి పదార్థాలను బయటకు పంపినప్పటికీ.. శరీరంలో అధికంగా అల్యూమినియం ఉంటే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈజిప్టులోని ఐన్ షామ్స్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఘడా బస్సియోని మాట్లాడుతూ.. మన వంటగదిలో ఉండే అల్యూమినియం శరీరంలోకి ఏదో విధంగా చేరుతుంది. దీంతో.. అల్యూమినియంకు ఎక్కువగా గురికావడం వల్ల శరీరంలో గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్ఛ, నెమ్మదిగా ఎదుగుదల (పిల్లల్లో) మొదలైనవి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. అల్యూమినియం పాత్రలు లేదా పాన్‌లలో వండే ఆహారం కంటే.. అల్యూమినియం కవర్స్లో ఆహారాన్ని ఉంచడం చాలా ప్రమాదకరమని అంటున్నారు.

Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..

అల్యూమినియం ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణలు కనుగొన్నారు. అంతేకాకుండా.. టమోటాలు, నిమ్మకాయల్లో కూడా అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల కూడా శరీరంలోకి అల్యూమినియం చేరుతుంది. అయితే.. వంటగదిలో అల్యూమినియంను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని, దాని వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని ఉడికించాలి. ఆహారాన్ని వండడానికి గాజు లేదా సిరామిక్ పాత్రలు వంటి అల్యూమినియం కాని పాత్రలను ఉపయోగించండి. అంతే కాకుండా అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచడం మానుకోవాలి. ఆహారాన్ని అల్యూమినియం కవర్స్లో ఉంచడం.. ఓవెన్‌లో వేడి చేయొద్దు.