NTV Telugu Site icon

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే వీటిని తినండి

మామూలుగా అందరూ బరువు తగ్గడానికి చాలా రకాల డైట్‌లు ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా చాలా మంది ఆహారాన్ని తినడం తగ్గించి బరువు తగ్గుదామనుకుంటే అది పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరానికి అవసరమైనంత పోషకాలు అందకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారినపడే అవకాశం ఉంది.

కాబట్టి ఉదయం పాటించే డైట్‌లో కొన్ని ఆహర పదార్థాలను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం తినే డైట్‌లో ఏదైనా పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. పండ్లను మార్నింగ్‌ తీసుకోవడం వల్ల ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుందని కూడా తెలుపుతున్నారు.

ఆపిల్‌ లో గ్లిసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల దీన్ని మార్నింగ్‌ తినోచ్చు. దీనితో పాటు విటమిన్‌ సి ఉన్న పండ్లను తీసుకుంటే ఒత్తిడి తగ్గించడానికి దోహదపడుతాయి. ముఖ్యంగా పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తాయి. పండ్లు న్యాచురల్‌ గ్లూకోజ్‌ను అందిస్తాయి. పండ్లను ఉదయం పూట తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.