సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ (బాదం, కాజూ, పిస్తా, వాల్‌నట్ మొదలైనవి) మరియు సుగంధ ద్రవ్యాలు (జీలకర్ర, ధనియా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి) తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో పెడుతున్నారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనలో చాలామంది కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే కొన్నిరకాల పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చని అంటున్నారు. కొన్ని పదార్ధాలు క్యాన్సర్ కు కారకాలుగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. ఫ్రిజ్‌లోని అతిగా ఉండే తేమ కారణంగా డ్రై ఫ్రూట్స్ తడిసి బూజు పట్టే ప్రమాదం పెరుగుతుంది.సుగంధ ద్రవ్యాల సువాసన, రుచి తగ్గిపోతాయి.డ్రై ఫ్రూట్స్ కరకరలాడే గుణం తగ్గి మెత్తబడిపోతాయి. కొన్ని ఆహార పదార్థాలు తప్పుడు రీతిలో నిల్వ చేస్తే విషతుల్యమయ్యే అవకాశం ఉంది.తేమ కారణంగా కొన్నిసార్లు హానికర రసాయనాలు ఏర్పడే పరిస్థితులు కూడా రావచ్చని నిపుణుల హెచ్చరిస్తున్నారు. .
ఫ్రిజ్‌లో డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ పౌడర్, నూనెలు, కుంకుమపువ్వు, బ్రెడ్, క్యారెట్ అల్లం, ముల్లంగి, బంగాళాదుంపలు పెట్టకూడని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ పెట్టాల్సి వస్తే.. ఫ్రిజ్‌లో పెట్టకుండా గాలి లోపలికి రానివ్వని ఎయిర్‌టైట్ గాజు సీసాలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
