NTV Telugu Site icon

Beer Side Effects : రోజూ బీర్ తాగుతున్నారా? ఇవి తెలుసుకోకుంటే డేంజర్లో పడ్డట్లే..

Beer

Beer

సాదారణంగా నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద ఎలా దిగదో మందుబాబులకు చుక్క గొంతులో పడందే నిద్ర పట్టదు.. కొందరు భాధను మర్చిపోవడానికి తాగితే, మరికొందరు కారణాలు వెతుక్కొని తాగుతుంటారు. అయితే రోజూ బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజు బీర్ ను తాగడం వల్ల ఏదైన ప్రమాదం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బీర్ తాగితే ఎముకల సాంద్రత పెరుగుతుందట. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది మేలు చేస్తుందట. బీర్ తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అయితే రోజూ బీర్ తాగకూడదు.. వారానికి ఒకసారో.. రెండు సార్లు బీర్ ను తాగితే మంచిదట.. అదే రోజూ తాగితే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు..

బరువు తగ్గాలనుకునే వారు బీర్ తాగితే ఆ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. రోజూ బీర్ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. చాలా మంది మద్యం సేవిస్తే చక్కగా నిద్రపడుతుందని అనుకుంటారు. కానీ రోజు తాగితే రివర్స్ అవుతుంది.. నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయట.. మెదడు పనితీరు మందగిస్తుంది..రోజూ సేవించడం వల్ల పేగులకు ఎంతగానో నష్టం కలుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి.. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం,వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.. అందుకే ఎవరైనా వారానికి ఒకసారి మాత్రమే తాగాలని చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.