Site icon NTV Telugu

Using Geyser : గీజర్‌లతో జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

Geyser

Geyser

చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా.. చేతులు, ముఖం కడుక్కోవడానికి, స్నానానికి గీజర్లు వాడుతున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ గీజర్లతో పాటు ఎల్‌పీజీ గీజర్ల వాడకం కూడా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. స్నానం చేస్తూ స్పృహతప్పి పడిపోవడంతో పాటు పలు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రీజర్‌లు వాడేవాళ్లు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..

READ MORE: Clove water for Hair Care : జుట్టు రాలడం, చుండ్రు ఇబ్బంది పెడుతుందా.. లవంగం నీటిని ట్రై చేయండి.. తక్షణ ఉపశమనం లభిస్తుంది

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బాత్‌రూమ్‌లో గీజర్‌ ఉపయోగిస్తున్న వారు తప్పకుండా వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్‌ గీజర్‌లను వాడేవారి బాత్‌రూమ్‌లో వెంటిలేషన్‌ కాస్త పెద్దగా ఉండాలి. ఎందుకంటే.. గీజర్‌ నుంచి ఏవైనా విషపూరిత గ్యాస్‌లు లీకైతే.. త్వరగా బయటకు వెళ్లిపోతాయి. గ్యాస్ గీజర్‌ను వెంటిలేషన్‌ లేని బాత్రూమ్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు. అలాగే గ్యాస్‌ గీజర్‌లను వాడేవారు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్‌ కూడా ఆన్‌లోనే ఉండాలి. దీనివల్ల విడుదలైన వాయువులు బయటకు వెళ్లిపోతాయి.
కొంతమంది గీజర్‌లను ఆఫ్‌ చేయడం మర్చిపోతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదు. గీజర్‌ వాడిన తర్వాత బంద్‌ చేయాలి.
అలాగే గీజర్‌లను పిల్లలకు అందకుండా.. కాస్త ఎత్తులో అమర్చుకోవడం మంచిది.

READ MORE: JC Prabhakar Reddy: జేసీ సంచలన వ్యాఖ్యలు.. నాకు కోపం, రోషం ఉంది.. కొట్టడం కూడా తెలుసు..!

సర్వీసింగ్‌ తప్పనిసరి..
గీజర్‌ కు టెక్నీషియన్‌తో సర్వీసింగ్‌ చేయించండి. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చడానికి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా.. వెంటనే బయటకు వచ్చేయండి. గీజర్‌ నుంచి వాటర్‌ లీకవుతున్నాయా ? లేదా ? అని తరచూ చెక్‌ చేస్తుండాలి. అలాగే ఏదైనా గ్యాస్‌ లీకవుతున్నట్లుగా అనిపిస్తే.. వెంటనే బాత్‌రూమ్‌లో నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత మంచి టెక్నీషియన్‌తో రిపేర్‌ చేయించాలి. కొత్తగా గ్యాస్‌ గీజర్‌లను కొనుగోలు చేసేవారు మంచి రేటింగ్ ఉన్నవాటిని ఎంపిక చేసుకోండి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు గ్యాస్‌ గీజర్‌ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించవచ్చు.

Exit mobile version