NTV Telugu Site icon

Dark Chocolate: డార్క్ చాక్లేట్ రోజూ తీసుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా?

Dark Chacolates

Dark Chacolates

Dark Chocolate: చాక్లేట్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు..డార్క్ చాక్లేట్ రుచి కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు, లిబిడో తగ్గడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి సమస్యలతో బాధ పడేవారు డార్క్ చాక్లేట్ ను రోజూ తీసుకుంటే అక్కడ రెచ్చిపోతారట.. ఇక ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.. డార్క్ చాక్లెట్లు సెక్స్ డ్రైవ్ కు కూడా ఎంతో సహాయపడతాయి. ఇవి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.. లైంగిక పనితీరును, కోరికలను పెంచే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫెనిలేథైలామైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపామైన్ ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించి, ఆనందాన్ని పెంచుతుంది.. వీటిలో ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఈ ఫ్లేవనాయిడ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి లైంగిక పనితీరుపై సానుకూల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతుతుంది. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పురుషులు, మహిళల్లో లైంగిక పనితీరు పెరుగుతుందని చెబుతున్నారు.డార్క్ చాక్లెట్ ఒక సహజ కామోద్దీపన. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న హార్మోన్. ఇది భాగస్వాములిద్దరికీ మరింత సానుకూల, ఆహ్లాదకరమైన లైంగిక అనుభూతిని కలిగిస్తుంది.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది..

Show comments