రేపే మహా శివరాత్రి. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం. శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేసి శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కాగా.. వారానికి ఒక రోజు దీన్ని ఉపవాసం ఉంటే పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం మన శరీరాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే.. అనేక అనారోగ్యాలు దూరం అవుతాయట.
జీర్ణ వ్యవస్థకు బ్రేక్..
మనం రోజూ ఆహారం తింటూ ఉంటే జీర్ణవ్యవస్థ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఉపవాసం జీర్ణవ్యవస్థకు చిన్న బ్రేక్ ఇస్తుంది. దీని వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది. వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తే.. జీర్ణవ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి. ఉపవాసం వల్ల శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది.
గుండెకు మేలు..
ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు గుండె సమస్యలు కామన్‌గా మారాయి. కానీ.. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే.. గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉపవాసం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉపవాసం చేస్తే హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటడంతో పాటు.. ట్రైగ్లిజరైడస్ స్థాయులు కూడా తగ్గుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అధిక బరువు సమస్య దూరం..
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన సమయానికి ఆహారం తినడం, వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, సరైన డైట్‌ను పాటించడం వంటివి చేస్తుంటారు. అయితే.. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. త్వరగా బరువు తగ్గుతామని నిపుణులు చేబుతున్నారు. ఉపవాసం మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి.. క్యాలరీను రిస్ట్రిక్ట్ చేయడం కంటే, ఉపవాసం ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యర్థాల తొలగింపు..
మన శరీరంలో.. టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు పేరుకుని ఉంటాయి. వీటిని శరీరం నుంచి తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగుతాయి. దీని వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
సుగర్‌కు చెక్..
వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, డయాబెటిస్ బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉపవాసం రక్తంలో చక్కెరను 3-6 శాతం తగ్గిస్తుంది. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను 20-31 శాతం తగ్గిస్తుంది, ఇది టైప్ 2 మధుమేహం నుంచి రక్షిస్తుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు..
వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే.. ఏజింగ్ ప్రాసెస్ నెమ్మది అవుతుందని, లైఫ్‌స్పాన్ పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఎలుకలను ఉపవాసం ఉంచితే.. ఇతర ఎలుకల కంటే 83 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నాయని గుర్తించారు.
నోట్: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ సమాచారం అందించాం. మీకు అనారోగ్య సమస్యలు ఉండే వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.. అంతే కాకుండా.. కొంతమంది కనీసం నీరు కూడా తాగకుండా.. ఉపవాసం చేస్తుంటారు. రోజంతా నీరు తాగకపోతే.. ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం. ఫాస్టింగ్ ఉన్న తర్వాత రోజు.. ముందు రోజు ఏమి తినలేదని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు.