టీమిండియాలో ఉన్న క్రికెటర్స్ అందరితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కి అత్యంత ప్రాధాన్యమిస్తారు. అతడు చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటాం. విరాట్ డైట్ చాలా ప్రత్యేకమని చెబుతుంటారు. ఆ డైట్ కేవలం ఆహారానికే వర్తించదు.. విరాట్ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మినరల్ వాటర్ కి బదులు ‘బ్లాక్ వాటర్’ని తాగుతాడట. సాధారణ మినరల్ వాటర్ బాటిల్ ధర లీటరుకు రూ.20-40 ఉంటే.. బ్లాక్ వాటర్ లీటర్ ధర సుమారు రూ.600 నుంచి రూ.3000 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం మొదలెట్టాడు కోహ్లీ. కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.
READ MORE: RGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?
ఏంటీ ఈ బ్లాక్ వాటర్?
నీటికి రంగు, రుచి ఉండవని అంటారు. కానీ అది తప్పని నిరూపిస్తుంది ఈ బ్లాక్ వాటర్. పేరుకు తగినట్లే ఈ నీళ్లు నలుపు రంగులో ఉంటాయి. సాధారణ నీటితో పోలిస్తే బ్లాక్ వాటర్ pH స్థాయి ఎక్కువగా ఉంటుంది. సాధారణ నీటి pH స్థాయి 6 నుంచి 7గా ఉంటుంది. అదే ఈ బ్లాక్ వాటర్ pH స్థాయి మాత్రం 8.5 కావడం విశేషం. నీటికి ఈ అధిక pH స్థాయి అనేది సహజసిద్ధంగా రావచ్చు లేదంటే ప్రత్యేకంగా అయోనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బ్లాక్ వాటర్‌లో 70కిపైగా మినరల్స్ ఉంటాయి. ఇది దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ బ్లాక్ వాటర్‌లోని అణువులు చిన్నగా ఉంటాయి. దీంతో వీటిని మన శరీర కణాలు సులువుగా శోషిస్తాయి. అంతేకాదు ఈ బ్లాక్ వాటర్ అణువులు మన శరీర వ్యవస్థకు మనం అందించే పోషకాలను నిలుపుకోవడంలోనూ చాలా వేగంగా పని చేస్తాయి. ఈ బ్లాక్ వాటర్‌తో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.