NTV Telugu Site icon

Diabetes: షుగర్ ఉన్నవాళ్లు అరటిపండ్లను ఇలా తీసుకోవడం మంచిదట..

Diabeties Banana

Diabeties Banana

షుగర్, బీపి వంటి వ్యాధులు ఒకసారి వస్తే ఇక జీవితాంతం పోవు.. ఎంతవరకు వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి.. లేకుంటే మాత్రం ఇక ప్రాణాలకు మాత్రం ముప్పే.. షుగర్ అధికంగా ఉండే కాయలు, పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు.. అలాంటి పండ్లలో ఒకటి అరటిపండు.. ఈ పండ్లలో షుగర్ అధికంగా ఉంటుంది.. అయితే షుగర్ పేషంట్స్ వీటిని అస్సలు తీసుకోవచ్చునో లేదో.. ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పండ్లను బాగా పండినవి కాకుండా కాస్త దోరగా ఉన్నవి తినాలి. బాగా పండినవి అయితే తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. ఆ పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమై త్వరగా చక్కెర రక్తంలో కలుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను కాకుండా కాస్త దోరగా ఉన్న అరటి పండ్లను తింటే మంచిది. వీటిల్లో ఒక మీడియం సైజ్ అరటి పండు అయితే సుమారుగా 14 గ్రాముల మేర కార్బొహైడ్రేట్లు ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు..

ఇక షుగర్ ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినరాదు. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌, లంచ్ లేదా డిన్నర్ మధ్యలో తినాలి. దీంతో అరటి పండ్లలో ఉండే చక్కెరలను శరీరం నెమ్మదిగాతీసుకోవాలి.. ఇక అరటి పండ్లను తింటే కొందరిలో షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అరటి పండ్లను తిన్న అనంతరం గంటన్నర సమయం పాటు ఆగి షుగర్ చెక్ చేయాలి. ఎక్కువగా ఉంటే అలాంటి వారు ఈ పండ్లను తినరాదు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే ఈ పండ్లను తినవచ్చు. ఇలా షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటి పండ్లను తీసుకోవచ్చు… ఇలా తీసుకోవడం వల్ల షుగర్ పెరగదని నిపుణులు చెబుతుంన్నారు.. మరో ముఖ్యమైన విషయం.. ఏంటంటే దోరగా ఉన్న వాటినే తీసుకోవాలి.. మర్చిపోకండి…

Show comments