Site icon NTV Telugu

Healthy Smoothie: ప్రతిరోజుకు హెల్తీ స్మూతీస్‌.. సహజ ఆరోగ్యం, అందం, ఆనందం మీ సొంతం!

Healthy Smoothie For Everyday

Healthy Smoothie For Everyday

Healthy Smoothie For Everyday: ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారానిదే కీలక పాత్ర. ఉదయాన్నే తీసుకొనే కొన్ని స్మూతీస్‌ మరింత మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. సరైన పోషకాలు తీసుకోవడానికి స్మూతీలు ఒక అద్భుతమైన ఎంపిక. ఇవి తేలికగా తయారవుతాయి, జీర్ణానికి సులభం, శరీరానికి అవసరమైన విటమిన్లు-ఖనిజాలు-ఫైబర్‌ను సమృద్ధిగా అందిస్తాయి. వారంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన స్మూతీ తీసుకుంటే.. శరీరం తాజాగా ఉండటమే కాకుండా శక్తి కూడా పెరుగుతుంది.

సోమవారం స్మూతీ:
గ్రీన్ ఆపిల్, అరటి, పాలకూర ఆకులు, కీరదోసకాయ, చియా గింజలు కలిపి చేసిన ఈ గ్రీన్ స్మూతీ డిటాక్స్‌కు ఉత్తమం. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

మంగళవారం స్మూతీ:
అరటి, ఓట్స్, ఖర్జూరాలు, దాల్చిన చెక్కతో చేసిన ఈ స్మూతీ ఉదయం ఎనర్జీ బూస్టర్‌గా పని చేస్తుంది. దీంట్లో ఫైబర్, సహజ తీపి ఉండటంతో శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది.

బుధవారం స్మూతీ:
అరటి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బాదం, బాదం పాలు, తేనెతో తయారయ్యే ఈ బెర్రీ స్మూతీ యాంటీ ఆక్సిడెంట్స్‌కి మంచి మూలం. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గురువారం స్మూతీ:
క్యారెట్, నారింజ, అవకాడో, నారింజరసం, తేనె కలిపిన ఈ ఆరెంజ్ స్మూతీ విటమిన్ C, బీటా కెరోటిన్‌తో నిండినది. ఇది కళ్ల ఆరోగ్యానికి, చర్మ కాంతికి సహాయపడుతుంది.

Also Read: Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!

శుక్రవారం స్మూతీ:
బీట్‌రూట్, మిక్స్‌డ్ బెర్రీస్, అరటి, గ్రీక్ యోగర్ట్, పాలు కలిపిన ఈ స్మూతీ రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది.

శనివారం స్మూతీ:
బ్లూబెర్రీ, ఓట్స్, చియా గింజలు, బాదం పాలు కలిపిన ఈ స్మూతీ హార్ట్ హెల్త్‌కు మంచిది. ఇది ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌తో నిండినది.

ఫైనల్లీ:
ప్రతిరోజూ ఒక స్మూతీ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సహజంగా లభిస్తాయి. జంక్ ఫుడ్‌కు బదులుగా ఈ సహజ పానీయాలను అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యవంతమైన జీవనశైలి సులభంగా సాధ్యమవుతుంది.

Exit mobile version