Site icon NTV Telugu

Health Tips: వంటింట్లో దివ్యౌషధం.. ఒక లుక్ వేయండి

Cumin Water Benefits

Cumin Water Benefits

Health Tips: వంటిల్లు అనగానే గుర్తుకు వచ్చేది గుమగుమలాడే వంటకాలు. ఒక్క నిమిషం ఆగండి .. ఇక్కడ ఎన్నో రోగాలకు దివ్యైషధంలా పని చేసే మందు దాగి ఉంది. చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ నిజంగా అమృతం అంటే నమ్మండి.. ఇంతకీ ఏంటదని ఆలోచిస్తున్నారా.. అదే జీలకర్ర. ఇది కేవలం వంటలో రుచిని మాత్రమే ఇచ్చోది కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలకు జీలకర్ర నీరు అద్భుతమైన ఔషధంగా పని చేస్తుందని అంటున్నారు.

READ ALSO: Hair Fall: జుట్టు అధికంగా రాలుతోందా? ఇవి తినండి చాలు..!

జీలకర్ర నీటితో ఆరోగ్య సమస్యలు దూరం..
సాధారణంగా భారతీయ వంటగదిలో ఉండే జీలకర్రలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో సాయపడతాయని పేర్కొన్నారు. ఈ నీరు జీర్ణవ్యవస్థను ఇది మెరుగుపరచడంతో పాటు, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపికగా సూచిస్తున్నారు.

దగ్గు, జలుబుతో బాధపడేవారు, కొద్దిగా వేడి చేసిన జీలకర్ర నీరు తాగితే చాలా మంచిది. దీనిలో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మలబద్ధకం సమస్యకు కూడా ఇది ఒక మంచి పరిష్కారం. జీలకర్రలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ అలవాటుగా జీలకర్ర నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. భోజనం తర్వాత ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగితే అజీర్తి తగ్గుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే చలువ చేస్తుందని చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉంటే, రాత్రి పడుకునే ముందు తాగితే మంచి నిద్ర పడుతుందని పేర్కొన్నారు.

READ ALSO: Hyderabad School Drug Lab: ‘ఈడియట్‌’ కి మూవీ క్లిప్‌ ఇన్‌స్పిరేషన్.. వందల కిలోమీటర్ల బైక్‌పై డ్రగ్స్ సరఫరా

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version