ఎండాకాలం వచ్చేసింది.. బాబోయ్ సూర్యోడి వేడికి జనాలు తట్టుకోలేక పోతున్నారు.. శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రెడ్ గా ఉంచుకోవాలి.. నీరు ఎక్కువగా ఉన్న పండ్లు కూరగాయలను తినడం మంచిది.. ఎండల వేడి నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.. అందులో కీరాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.. తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎండాకాలంలో కీరాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం..
ఎండల వల్ల మన చర్మం బాగా ప్రభావితమవుతుంది.. చర్మం అలా పొడి బారకుండా కీరా కాపాడుతుంది.. అలాగే ట్యాన్ ను కూడా తొలగించడంలో సహాయ పడుతుంది..
వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి.. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.. అంతేకాదు కడుపులో సమస్యలను తగ్గిస్తుంది..
వడదెబ్బకు గురైన వారికి కీరదోసకాయలు బాగా సహాయపడతాయి.. వెంటనే ఉపశమనం కలిగిస్తాయి.. అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది..
కీరాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగకుండా చేయడానికి బాగా సహాయపడతాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఆకలి తగ్గుతుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు మీ డైట్ లో కీరాను చేర్చుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.