NTV Telugu Site icon

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా ?

Kottimeera (2)

Kottimeera (2)

ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాపీలను తాగుతారు. కొందరేమో ఆరోగ్యానికి మంచివని హాట్ వాటర్ తాగుతారు. అయితే వాటికన్నా కొత్తిమీర నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొత్తిమీర చాలా పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాల గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

కొత్తిమీర నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది. ఎసిడిటి సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదు కడుపులో మంట, నొప్పి తగ్గుతుంది. కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఉదర సమస్యల నుంచి ఉపసమనం కలుగుతుంది..

అంతేకాదు మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.. బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలి దప్పులను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా చెప్పవచ్చు. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది.. ఇంకా అనేక సమస్యలను దూరం చేస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.