వివాహ బంధం మనదేశంలో చాలా గొప్పది.. ఈ బంధాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఒకప్పుడు పెళ్లిళ్లు వేరు,ఇప్పుడు పెళ్లిళ్లు వేరు.. ఇప్పుడు మనస్పర్థలు పేరుతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. చిన్న చిన్న విషయానికే గొడవలు పడటం, విడాకులు వరకు వెళ్తున్నారు.. అసలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ..
ఇటీవల కాలంలో చాలా మంది జంటలు ఒంటరిగా ఉంటున్నారు.. పిల్లల చదువులకోసం అనో లేదా ఉద్యోగం వల్లో నో తల్లి దండ్రులకు దూరంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడొచ్చే చుట్టాలు, అత్తగారి పెత్తనం అనేది కొంతమంది ఆడవారికి నచ్చక ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి.. ఇక పిల్లల విషయంలో గొడవలు రావడం కామన్ .. పిల్లల కారణంగా కొన్నిసార్లు ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అవసరాలు, కోరికల గురించి ఎవరు ఆలోచిస్తారనే గందరగోళం ఎదురవుతుంది. చాలా మంది పేరెంట్స్‌లో ఈ చర్చ గొడవకి దారి తీస్తుంది.ఆలా అది విడిపోయే వరకు తీసుకొని వస్తుంది..
అలాగే డబ్బులు విషయంలో గొడవలు వస్తాయి . ఇద్దరు జాబ్స్ చేస్తే ఈ గొడవలు ఎక్కువగా ఉంటాయని అందరికి తెలుసు.. ఇక ఇంట్లో పని విషయంలో గొడవలు వస్తాయి.. ఎందుకంటే అన్ని ఆడదే చెయ్యాలి , నేనెందుకు చెయ్యాలి నెలకు లక్షలు సంపాదిస్తున్న అని కొందరు మగవాళ్ళు అనుకుంటారు. అది చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరే ఉన్నప్పుడు కలిసి
పనిచేసుకుంటే గొడవలు రావని చెబుతున్నారు. చివరగా.. ఎప్పుడో జరిగిన విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల గొడవలు పెరగడం తప్ప తగ్గవు.. అందుకే ఎప్పుడూ ఇంట్లో ఉండి గొడవపడకుండా వారానికో నెలకో ఒకసారి బయటకు వెళ్లడం మంచిది.. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. మీ వాళ్ళు గొప్ప ఎం చేసారు అని అనడం మానేసి మనం ఎం చేస్తున్నామో అది చూడటం వల్ల ఇద్దరికీ గొడవలు రావని చెబుతున్నారు..
