Site icon NTV Telugu

Chicken vs Fish:చికెన్, చేపలు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫుడ్డో తెలుసా..

Untitled Design (2)

Untitled Design (2)

నాన్‌-వెజ్ ప్రియులకు ముక్కలంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అందులో ముఖ్యంగా చికెన్, చేపలు చాలా మందికి ప్రియమైనవి. అయితే పోషక విలువలు, జీర్ణశక్తి, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.

చికెన్‌లో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల కండరాల అభివృద్ధికి, బరువు నియంత్రణకు, ఫిట్‌నెస్ మెరుగుపర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణుుల చెబుతున్నారు. ఇందులోని విటమిన్ B6, B12, జింక్, ఐరన్ వంటి మూలకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. తక్కువ నూనెతో ఉడికించిన లేదా కాల్చిన రూపంలో తీసుకుంటే చికెన్ ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ వేయించినది లేదా అధిక మసాలాలతో వండినది కేలరీలు పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేపలు ఆరోగ్యకరమైన మాంసాహారాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. సహజంగా అందే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, మెదడు ఎదుగుదలలో, జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. చేపలు పిల్లలు, వృద్ధులు, జీర్ణ సమస్యలున్న వారికి మరింత అనుకూలం, ఎందుకంటే ఇవి చికెన్ కంటే త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఇందులోని విటమిన్ D, కాల్షియం ఎముకలను బలపరుస్తాయి. మొత్తం చూసుకుంటే చికెన్, చేప రెండింటికీ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే దగ్గరలోని న్యూట్రిషియన్ ను సంప్రదించడం ఉత్తమం.

Exit mobile version