ప్రస్తుతం కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక టమోటా ధరలు చెప్పనక్కర్లేదు ఎలా ఉన్నాయో.. టమోటా లేనిదే కూర రుచించదు.. దాంతో అందరు నాన్ వెజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. ఇక నాన్ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.. చికెన్ ధరలు తగ్గాయి కదా అని కుమ్మేస్తున్నారు.. ఒకరోజు, రెండు రోజులు అయితే ఓకే కానీ రోజూ అంటే కష్టమే అంటున్నారు నిపుణులు.. రోజూ చికెన్ తింటే ఏమౌతుందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను కూడా తింటూ ఉంటారు.. ప్రతి వంట ఒక రుచిని కలిగి ఉంటుంది.. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ 65 ఇలా చేసుకుని తింటాము. కొంత మంది వారంలో కనీసం 4 సార్లు చికెన్ తింటారు. మరి కొంతమందైతే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట.. అవి ప్రాణాలను కూడా తీస్తాయని నిపుణులు అంటున్నారు..
చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్ బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటే బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్ అవుతుంది. దీని వల్ల డయేరియా, నిమోనియా, ఊపిరి తిత్తుల సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే చికెన్‌లో ప్రోటీన్ ఎక్కవగా ఉంటుంది. శరీరం బర్న్ చేయలేని ప్రొటిన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి చికెన్ ఎప్పుడు తిన్నా గ్రేవీలా చేసుకొని తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. బాగా ఉడికించి తినడం మంచిదట.. శుభ్రత పాటిస్తూ కూరను చేసుకోవడం అన్ని విధాల మంచిది.. గుర్తుంచుకోండి..
