NTV Telugu Site icon

Chicken Kurma : చికెన్ తో కుర్మాను ఎప్పుడైనా ట్రై చేశారా?.. టేస్ట్ వేరే లెవల్..

Chicken Korma

Chicken Korma

నాన్ వెజ్ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది.. కళ్ల ముందుకు చికెన్ వెరైటీలు వస్తాయి.. ఎన్నెన్నో రకాల వంటలను చేస్తారు.. అందులో చికెన్ కుర్మా కూడా ఒక్కటి..చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు సాఫ్ట్ గా జ్యుసీగా ఉంటుంది.. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తాము..తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

చికెన్ – ముప్పావుకిలో,

తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు,

ధనియాల పొడి – ఒక టీ స్పూన్,

జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్,

గరం మసాలా – అర టీ స్పూన్,

ఉప్పు – తగినంత,

పెరుగు – 3 టేబుల్ స్పూన్స్,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్,

ఎండు కొబ్బరి ముక్కలు -ఒక టేబుల్ స్పూన్,

కారం – 3 టేబుల్ స్పూన్స్,

పసుపు – అర టీ స్పూన్,

గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్,

తరిగిన కొత్తిమీర- కొద్దిగా,

తరిగిన పచ్చిమిర్చి – 3,

కరివేపాకు -ఒక రెమ్మ,

నూనె- 4 టేబుల్ స్పూన్స్,

లవంగాలు – 4,

యాలకులు – 3,

దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క,

బిర్యానీ ఆకు – 2,

సాజీరా – అర టీ స్పూన్,

నల్ల యాలక్కాయ – 1,

అనాస పువ్వు -1,

జీడిపప్పు – 10.

తయారీ విధానం..

ముందుగా చికెన్ ను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని గసాలు,జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక మళ్లీ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయ్యే వరకు వేయించాలి.తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి.. ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.. ఆ తర్వాత పెరుగు, గసాల పేస్ట్, కొద్దిగా కొత్తి మీరా వేసి బాగా కలపాలి..తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. ఈ చికెన్ ను మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి.. స్లిమ్ మంటను ఉంచి నిమిషం బాగా కలపాలి.. అంతే ఎంతో రుచిగా, సాఫ్ట్ గా ఉండే చికెన్ కుర్మా రెడీ.. కొంచెం టైం పడుతుంది.. అయిన రుచిగా తినాలని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చెయ్యండి..