Site icon NTV Telugu

Health Tips: పొట్లకాయ, గుమ్మడితో ఆ ఆరోగ్య సమస్యలకు చెక్..!

Gummadi

Gummadi

Health Tips: సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలతో కొందరికి కొన్ని కూరగాయాలు కానీ, ఆకుకూరలు గానీ నచ్చవు. అది వారి ఇష్టఇష్టాలను బట్టి ఉంటుంది. ఆ విషయానికొస్తే.. పొట్లకాయ, గుమ్మడికాయ అంటే కూడా దాదాపు ఇష్టపడని వాళ్లు చాలామందే ఉంటారు. కానీ వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి అని తెలియదు. వాటి ద్వారా మానవుని శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Read Also: Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

పొట్లకాయ, గుమ్మడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటి రసాన్ని కలితాగడం వల్ల పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా సమ్మర్ లో అయితే.. బూడిద గుమ్మడికాయ జ్యూస్ త్రాగితే ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల దాహాన్ని తీర్చుకోవచ్చు. ఇది డీహైడ్రేషన్ సమస్యని దూరం చేస్తుంది. గుమ్మడి జ్యూస్ తీసుకోవడం వల్ల నీరు తీసుకోలేదన్న సమస్య తీరిపోతుంది.

Read Also: Coconut Laddu : ఇలా సింపుల్ గా కొబ్బరి లడ్డు చేస్తే.. అస్సలు వదలరు..

అంతేకాకుండా శరీర సరైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలు గుమ్మడిలో ఉంటాయి. దీని రెగ్యులర్‌‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ రసం తాగితే మూత్ర సమస్యలు దూరమవుతాయి. ఇది మూత్రవిసర్జనని శుభ్రపరుస్తుంది. మూత్రంలో మంట ఉన్నట్లైతే.. ఆ జ్యూస్ తాగితే ఎక్కువగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా మూత్రపిండాల్లో పేరుకుపోయి ఉన్న స్టోన్స్ ను కరిగిస్తుంది. ఇంకా ఈ జ్యూస్ వల్ల షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర లెవల్స్ ని కంట్రోల్ అవుతుంది. కాబట్టి, షుగర్ పేషెంట్స్‌ రోజూ తీసుకుంటే వారి ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల, ఇది వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. గుమ్మడి తినడం వల్ల మెదడు మంచిగా పనిచేస్తుంది. అంతేకాకుండా స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version